నా మనసును నీవు
దోచినావని
దిగులు పడు తుంటిని
ఆ మనసును చేరు
దారి కొరకు వెతుకుతుంటిని
ఒక్కసారి నీ
చూపల వంతెన
వేస్తావా...
ప్రయాసైనా
పరవాలేదు
నా మనసును చేరి
ఒక చిన్న మాట
చెప్పాలి...
'నీ వున్న
ఈ స్థలం నీకు సరికాదు
తప్పించుకునైనా
సరే...
వచ్చేయమని'
ఒక చిన్నమాట చెప్పాలి...