|
|
Articles: Poetry | తెలుగు పాట - Site Administrator
| |
(రెంటాల శ్రీవేంకటేశ్వరరావు)
ఏమి తెలుగు! ఏమి తెలుగు!
మన జన్మకు వెలుగు - అది
మన ఉనికికి మెరుగు
వెలుగన్నా! మెరుగన్నా!
తెలుగన్నా! తెలిసి మెలుగు
నీకు మేలు కలుగు
నీ పెదవి భాష తెలుగు
నీ కలల భాష తెలుగు
నీ అవగాహన రంగు తెలుగు
ఆలోచన తెలుగు
భాష రాని నాడు మనిషి జంతువు అవుతాడు కదా!
నిన్నొక మనిషగ మలచిన బ్రహ్మ సుమా తెలుగు
నీ మాటను కన్న మరో అమ్మ సుమా తెలుగు
పరువనుకొని సిరికొరకని పరభాషకు పరుగు
ఫలితం గమనించావా? ఒక పరాయి బతుకు
భాషంటే మాట కాదయా సంస్కృతి మూట
నిన్ను నిన్నుగా నిలిపే సొంత పలుకు పలుకు
కోకిల వినిపించరాదు కదా చిలక పలుకు
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|