TeluguPeople
  are the trend-setters

 
Articles: Devotion
సాఫల్యత యొక్క రహస్యం
- Site Administrator
  Page: 1 of 1    
ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నతమైన హోదాలో ఉంటూ దుష్కృత్యాలకు పాల్పడుతూ ఉన్నాడంటే ఆ దుష్కృత్యాల వలననే అతడికి హోదా లభించిందన్నది నిజం కాదు. ఇంతకు పూర్వం అతడు చేసిన ఏదో ఒక పని అద్వైత జ్ఞానంతో కూడుకొని అలరించి ఉండవచ్చు. దాని ఫలితంగానే అతడికి ఈనాడు ఇటువంటి ఉన్నతమైన హోదా లభించింది. ఇప్పుడతడు తప్పులు చేస్తున్నాడంటే తప్పకుండా క్రిందికి దిగజారతాడు. మాయలు, మోసాలు చేస్తూ ఈర్ష్యాద్వేషాలను చూపిస్తున్నప్పుడు తప్పక క్రిందికి దిగజారతాడు. విద్యార్థి ఎప్పుడు సాఫల్యతను పొందుతాడు? ఎప్పుడైతే అతడు నిశ్చింతుడై చదువుతాడో, నిర్భయుడై పరీక్ష వ్రాస్తాడో అప్పుడే అతడు సాఫల్యతను పొందుతాడు. చింతితుడై, భయభీతుడై చదివినా, రాసినా అతడు సాఫల్యతను పొందలేడు. యుద్ధరంగంలో యోధుడు ఎప్పుడు సాఫల్యతను పొందుతాడంటే తెలిసో తెలియకో అతడు తన దేహధ్యాసను అధిగమించినప్పుడు. వక్తృత్వంలో వక్త సాఫల్యతను ఎప్పుడు సాధిస్తాడంటే అతడు తనకు తెలియకుండానే తనను తాను మైమరచిపోయినప్పుడు. అప్పుడు అతడి ద్వారా అందమైన, వినసొంపైన వాణి వెలువడుతుంది. ఒకవేళ ఎవరైనా తన ప్రత్యేకతను చాటుకోవడానికి 'ఇది చెప్పాలి... అది చెప్పాలి...' అని ఆలోచించి, రాసుకొని, చదువుకొని బట్టీపట్టి వచ్చినప్పటికీ చక్కగా మాట్లాడలేకపోతారు. ఎవరైతే దేహధ్యాసను అధిగమించారో అటు వంటివారు చదవుకుండానే, బట్టీ పట్టకుండానే చెప్పగలుగుతారు. అది సంత్ వాణిగా మారిపోతుంది. 'సత్సంగం'గా మారిపోతుంది. అంతర్యామియగు పరమాత్మ పట్ల మనం ఎంత నిజాయితీగా ఉంటామో, దేహధ్యాసను అధిగమిస్తామో, లౌకికమైన 'నువ్వు...', 'నేను...' అనే ఆకర్షణా రహితులమై ఉంటామో, సహజంగా స్వాభావికంగా ఉంటామో అంతగా మన అంతరంగంలోని పరమాత్మతో జోడింపబడి ఉంటాము. అలాగే సాఫల్యతను పొందుతూ ఉంటాము. ఎంతగా మనం బాహ్య పరిస్థితులకు లోనౌతామో, అంతరాత్మతో గల సంబంధాన్ని ఛిన్నాభిన్నం చేసుకుంటామో అంతగా ఎంత చక్కటి ప్రణాళికతో కూడిన పథకమైనా మట్టి కొట్టుకుపోతుంది. ఏ రంగంలోనైనా సరే సాఫల్యతను సాధించాలంటే నిజాయితీ, పరోపకారం, సరళస్వభావం అనే వాటిని ఆధారంగా చేసుకొంటూ భగవంతునితో ఐక్యతను నెలకొల్పుకొంటూ లోకంలోని పనులను చెయ్యడం మొదలుపెట్టు. అలా కాకుండా ఎప్పుడైతే నువ్వు నీ అంతరాత్మతో ఉండే సంబంధాన్ని చెడగొట్టు కుంటావో అప్పుడు లోకం కూడా నీతో ఉన్న సంబంధాన్ని తెగ త్రెంపులు చేసుకొంటుంది. (సంత్ శ్రీ ఆసారామ్ జీ ఋషి ప్రసాద్ నుండి)

Be first to comment on this Article!

  Page: 1 of 1    



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.