|
|
Articles: Poetry | నానీలు - 38 - Miss kumari kumari
| |
పుడమి తల్లికి
రోజూ పురుళ్ళే..
పోస్తున్న బిడ్డలు
వ్యవసాయదారులు..
జన స్రవంతి రక్తకణాలకై
అన్నదాత చేసే
శ్రమ యజ్ఞం..
వ్యవసాయం..
నరికితే
ఒరిగిన చెట్టు కార్చిన
రక్తపు బొట్లే..
ఓజోన్ పొర తూట్లు..
వదలిన గాలి
పీల్చిన చెట్టు..
మనిషి ఉన్నా - పోయినా
రుణం తీరుస్తుంది..
ఆ గుళ్ళో మట్టే దేవుడు
రైతే పూజారి
సేద్యమే బ్రహ్మోత్సవం
పంటే ప్రసాదం
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|