|
|
Articles: Poetry | ఈ జీవితార్థమేంటి? - Dr. Raghotham Reddy Pinninti
| |
కలసి బ్రతకడంలో
తప్పులు చేయడంలో
సరిచేసుకు నడవడంలో
అందరిలో కలసిపోవడంలో
పరుగులుపెట్టే ప్రయాణం
జీవం నిండిన జీవితం
జ్ఞాపకంగా మిగిలిపోయి
కన్నీరులా జారిపోయి
ప్రస్తుతాన్ని తడుముతుంటే
ఎక్కడున్నానోనని వెతుక్కుంటుంటే
నాకేంటి...
బ్యాంకులో బ్యాలెన్స్ ను
హెల్త్ కు ఇన్సూరెన్సును
భవిష్యత్తుకు నో ప్రోబ్లెంను
దేన్నైనా కొనగలిగే డబ్బున్నపుడు
ఏదయినా చేయగలిగే ఛాన్స్ ఉన్నపుడు
దేవుడు.. నీవాడు.. నావాడు...నాకు ఎందుకు
మత్తులన్ని నన్ను వదిలినప్పుడు
ఒంటరివాడిని అనిపించినపుడు
అరిచే అరుపునకు దిక్కేది...
ఈ జీవితాలకు అర్థం ఏది?
| Read 4 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|