|
|
Articles: Poetry | మరుపు- మరణం - Dr. Raghotham Reddy Pinninti
| |
కలలోనయినా కనిపించావనీ
గెంతులు వేస్తుంటే
మరిచిపోయావు కదు...అని అడిగావు
ఏం చెప్పమంటావు
నీ జ్ఞాపకాల పలకరింపు లేనిదెన్నడు
నీ పరిచయాల పరిమళాలు నను తాకనిదెన్నడు
నీవు లేవని ఫీలవ్వని క్షణమెన్నడు
మరిచిపోవాలనుకునే ప్రతీసారి
జ్ఞాపకాల వనంలో నీకు దొరికిపోతుంటాను
జ్ఞాపకముగానయినా మిగిలినందుకు మురిసిపోతుంటాను
నిను మరవడం సాధ్యమా నేస్తం
నువ్వంటూ లేకుంటే
జీవితమే లేదు
నీ ప్రేమజల్లులో తడవకుంటే
ఈ మొక్కకు జీవం లేదు
గమ్యం గమనం
అన్నీ నీవు అయినప్పుడు
మరచిపోవడం అంటే
మరణమే
| Read 4 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|