|
|
Articles: Poetry | నానీలు - 43 - Miss kumari kumari
| |
అంతశ్శత్రువులు
పోయేదెలా?
దృష్టంతా
బాహ్య శత్రువులపై అయితే!
బ్రహ్మచారి(ణి)కి
పట్నంలో గది కరువు..
రాజకీయాల్లో మాత్రం
రాచ మర్యాద..
కడుపు కోతకు
పునాది గట్టిది..
వైద్యుడు కోసి తీసిన
బిడ్డలే వాడు..
కోడలొచ్చి అత్తను
నాన్నకు చెల్లిని చేస్తే..
'కాకా' అని
ఆరళ్ళు మొదలు..
ప్రేమలోని కమ్మదనమే
'అమ్మతనం'..
ఇక 'మదర్స్ డే'
ప్రేమికుల రోజే..
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|