|
|
Articles: Devotion | గురుపూర్ణిమ-సందేశం - Site Administrator
| |
గురుపూర్ణిమ అనేది జన్మజన్మాంతరాలుగా దారి తప్పుతున్న జీవునిలో ఆచార్యుని యొక్క భగవానుని యొక్క శాస్త్రాల యొక్క వచనాలను మరియు జీవుని యొక్క స్వానుభవంతో కూడిన జ్ఞానం, భక్తి, యోగాల ప్రసాదాన్ని నింపి అతడి యొక్క యోగ్యతను ఎలా మార్చివేస్తుందంటే ఆ జీవుడు మళ్ళీ తిరిగి తల్లుల గర్భం యొక్క పీడనను సహించే దుర్గమమైన మార్గం ఏదైతే ఉందో దాని నుండి రక్షించబడి పరమపదానికి హక్కుదారుడుగా మారిపోతాడు. పరమపదానికి హక్కుదారునిగా మార్చగలిగే వేదవ్యాస మహర్షి వంటి బ్రహ్మవేత్తలగు గురువులు ఎవరైతే ఉన్నారో ఆ గురువులను గుర్తుచేసుకొని మనచిత్తాన్ని పావనం చేసుకొనే రోజు గురుపూర్ణిమరోజు.
ఇది తపస్సునాచరించే రోజు, వ్రతాన్ని ఆచరించే రోజు. ఈ రోజున ఆచార్యుల మార్గదర్శకత్వాన్ని అనుసరించి మన జీవితాలలో ఏదైనా కొత్ర వ్రతాన్ని స్వీకరించే రేజు. నా మనస్సులో ఫలానా బలహీనతలు ఉన్నాయి, నా ప్రవర్తనలో ఫలానా లోపాలు ఉన్నాయి, నా జీవితంలో ఫలానా లోపాలు ఉన్నాయి - ఈ ప్రకారంగా ఆత్మవిశ్లేషణ చేసుకొని ఆ లోపాలను పెకలించివెయ్యగల ఏదైనా వ్రతం, జపం, అనుష్ఠానం మొదలగు ఏదైనా నియమాన్ని స్వీకరించి మున్ముందు సాగించవలసిన యాత్రను గురించి సంకల్పం చేసే రోజు ఇది.
వ్యాసపూర్ణిమ తరువాత ఆథ్యాత్మిక సంస్కృతి యొక్క విద్యాలయాలు తెరువబడి నూతన పాఠాలు మొదలవుతాయి. ఉదాహరణకు ఎండా కాలంలో నేల ఎండిపోతుంది. వ్యాసపూర్ణిమ నాటికి వర్షం కురవడం వల్ల భూమిలో కొత్త చైతన్యం వస్తుంది. వృక్షాలలో కొత్త జీవం వస్తుంది. అదే విధంగా వ్యాసపూర్ణిమ అనేది సాధకుని జీవితంలో కొత్త ఆథ్యాత్మిక చైతన్యాన్ని, కొత్త వెలుగును, కొత్త ఆనందాన్ని, కొత్త ఉల్లాసాన్ని నింపి సాధకుడికి కొత్త జీవనం వైపు ముందుకు సాగడానికి ప్రేరణను కలిగిస్తుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|