|
|
Articles: Short Stories | మేకవన్నె పులి - Mr. Pratap Cherukuri Pratap
| |
ఆర్ధ రాత్రి ఒంటి గంట అయ్యింది. న్యూయార్క్ నగరం హాయిగా మత్తులో నిదురిస్తోంది. ఎయిర్ కండిషనర్ చల్లదనం లో మెత్తటి ఫోం బెడ్ పై దట్టమైన రగ్గు కప్పుకొని భార్య కౌగిల్లో వెచ్చ గా ఆదమరిచి నిద్రిస్తున్నాడు వేణు. ఇంతలో అతని నిద్రకు భంగం కలిగిస్తూ ప్రక్కనే టేబుల్ పై వున్న సెల్ ఫోన్ మోగింది. సాధారణం గా ఈ సమయం లో అతనికి ఎవరూ ఫోన్ చెయ్యరు. అలాంటిది ఫోన్ వచ్చిందంటే ఏదో అర్జంట్ మెసేజ్ అయి వుంటుంది. ఏమై వుంటుందబ్బా అనుకుంటూ ఇంగ్లీషులో ఒక బూతు తిట్టి ఉదుటున లేచి సెల్ అందుకున్నాడు. ఆవతలి వైపు నుండి భాస్కర్ 'బావా! చాలా ఘోరం జరిగిపోయింది. నాన్న మనకు ఇక లేరు' వెక్కుతున్నట్లు స్పష్టం గా వినిపిస్తోంది.
వేణుకు వున్న కాస్త మత్తు కూడా దిగిపోయింది. 'ఏమిటి భాస్కర్ నువ్వంటున్నది? ఆతృతగా అడిగాడు.
'నిన్న రాత్రి ఊపిరి సరిగ్గా అందక ఆయాసపడ్తుంటే శ్యామా నర్శింగ్ హోం లో చేర్పించాం. ఆక్సిజన్ పెట్టారు. అయినా పొద్దునకు పరిస్థితి బాగా క్షీణించింది.డాక్టర్లు ఎంత ట్రై చేసినా ప్రాణాలు కాపాడలేకపోయారు. పావు గంట క్రితమే ఆయన వెళ్ళిపోయారు' ఏడుస్తున్నాడు భాస్కర్. వేణూకి దుఖంతో నోటి మాట రాలేదు.
'బావా ఇక్కడ నేనొక్కడినే అన్నీ చూసుకోవాలి, నాకు సాయంగా వుండడానికి వెంటనే బయలుదేరి రా!' అభ్యర్ధించాడు భాస్కర్.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|