|
|
Articles: Poetry | తిరుమల యాత్ర - Mr. Jagannadha Rao LakshmiPrasad
| |
మొదట చేరుకుంటిమి అలిపిరి
అచట మా వాహనములు నిలిపిరి
పిదప తనిఖీలు సలిపిరి
మా జేబులన్నియూ నలిపిరి
పిమ్మట కొండపైకి పంపిరి
గోవింద నామస్మరణలో
భక్తులందరూ గొంతు కలిపిరి
కళ్యాణకట్ట వద్ద టోకెను చింపిరి
క్షురకుని కత్తికి మా తలనీలాలు
అయ్యెను చింపిరి చింపిరి
ఎండలో మా ముఖముపై మొలిచెను ఉలిపిరి
క్యూలో మా వెనుకవారు
మా వీపులపై దుమ్ము దులిపిరి
కౌసల్యా సుప్రజా రామాయని
వడ్డికాసులవాని మేలుకొలిపిరి
ఏడు కొండలవాని దర్శనము
ఆలశ్యమగునని తెలిపిరి
ఏడు గంటల పిదప ఇంకనూ
మిగిలెను మాలో కొనఊపిరి!
| Read 4 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|