|
|
Articles: Devotion | సాయి నక్షత్ర మాలిక - Site Administrator
| |
షిరిడీ సదనా శ్రీసాయీ - సుందర వదనా శుభదాయీ
జగత్కారణా జయసాయీ - నీ స్మరణే ఎంతో హాయీ
శిరమున వస్త్రము చుట్టితివి - చినిగిన కఫనీ తొడిగితివీ
ఫకీరువలె కనపించితివీ - పరమాత్ముడ వనిపించితివీ
చాందు పటేలుని పిలిచితివీ - అశ్వము జాడా తెలిపితివీ
మహల్సా భక్తికి మురిసితివీ - 'సాయ'ని పిలిచితే పలికితివీ
గోధుమ పిండిని విసిరితివీ - కలరా వ్యాధిని తరిమితివీ
తుఫాను తాడికి నాపితివీ - అపాయమును తప్పించితివీ
అయిదిళ్ళలో భిక్షడిగితివీ - పాపాలను పరిమార్చితివీ
బాయిజ సేవను మెచ్చితివీ - సాయుజ్యమునూ యిచ్చితివీ
నీళ్ళను నూనెగ మార్చితివీ - దీపాలను వెలిగించితివీ
సూకర నైజము తెలిపితివీ - నిందలు వేయుట మాన్పితివీ
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|