|
|
|
|
Articles: Poetry | స్నేహమా - Mrs. haripriya haripriya
| |
ఓడి వాడి మోడైన నన్ను
మేఘమై కమ్ముకుని
చినుకువై కురిశావు
చైతన్యం కలిగించావు
మరలా జీవం పోసుకుని
చిగురించి తొలి ఆకునై
మలి ఆకునై
మొగ్గనై పువ్వై విరిశాను
మరలా నువ్వు చినుకువై వస్తావని
ఎదురుతెన్నుల ఆశలు విరబూయాలని,
కానీ నీవెటో ఇంకెటో మరెటో
వెళ్ళిపోతూ ఉంటే
నేనిలా ఒంటరిగా ఉండనా?
నేనూ వస్తున్నా నీ వెంటనే
గాలినై నిన్ననుసరిస్తూ
నిన్ను కదిలిస్తూ
నీ కదలికల్ని గమనిస్తూ
బరువుగా నువ్వాగిన చొట
నీతో గుసగుసలాడుతూ
నీవు జీవం పోసే ప్రతి మోడులో
చైతన్యాన్ని పరివేక్షిస్తూ
నీకు తెలియకుండానే
నీ చుట్టూ పరిభ్రమిస్తున్నా,
స్నేహమా! స్నేహమా!
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|