TeluguPeople
  are the trend-setters

 
Articles: Devotion
నారాయణ వందనం
- Mr. venkataramayya putrevu
  Page: 1 of 1    
పద్మనాభ పురుషోత్తమ పుష్కరాక్షా! కేశవ జనార్ధన చక్రపాణే! దేవాది యోగీంద్ర సంస్తుత్య సద్భక్తచింతామణీ లోకరక్షామణీ! రమాధీశా ఈశా! నీ చరణకమలములకిదే వందనం అభివందనం! బ్రహ్మపూజ్యంబైన భవదీయపాదాబ్జముల్ సేవించుచున్ మోక్షదాయకంబైన భవన్మంగళకీర్తనల్జేయుచున్ కొల్తుము నిన్ననన్యభక్తియుక్తులన్, యో!కమలనాభా కమలాపతీ! విన్నపములివె నీకయ్యా విశ్వేశా! కరుణతో మమ్మేలుమెప్పుడు కమలేశా! నీ మనోజ్ఞ రూపమె మా యెడందలన్ హత్తుకొనిపోగా మా సర్వాంగముల్ నీయందె వర్తింపగాజేసి ఈ జన్మంబుననైన మరేజన్మంబుననైన సదా నిన్నె కొల్చి తరింపగా నీదాసానుదాసుల మమున్ కటాక్షింపుమో కృపాకారుణ్య నిధానా కమలేక్షణా! నీ సుభచరణాలకిదే వందనం అభివందనం! శ్యామసుందరా నీ చరణసంసేవనంబె ముక్తిదాయకం ధరణీసుతపాలా నీ దివ్యరూపావలో కనమె మంగళదాయకం పుండరీకాక్షా నీ పతితపావన నామస్మరణం భవహరణం దశరథనందనా దీనజనావనా దయతో మమ్మేలుమెప్పుడు.

Read 1 Comment(s) posted so far on this Article!

  Page: 1 of 1    



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.