|
|
|
|
Articles: Poetry | క్షమించు వైష్ణవీ... - Mr. Narender Kumar Kulkarni
| |
ఇంటర్నెట్లో, శాటిలైట్`ఫోన్`లో...
గూగుల్ ఎర్తు, వెబ్ క్యాం చాట్లూ...
ప్రపంచమొక కుగ్రామమైందని సంబరపడదామా?
మనిషి గుండె మరీ ఇంత ఇరుకయిందేమిటి?
ఇరుకు గుండె నిండా మురికి వాసన...
వెళ్ళిపోయావా వైష్ణవీ!
సుగంధమనే మత్తు కోసం
లేత కుసుమాలని సైతం
నీటిలో మరిగించే ఈ లోకం నుండి!
కారడవులనే జల్లెడ పట్టగల మన పోలీసులు
ప్రళయాలను సైతం ప్రణాళికలతో ఎదుర్కోగల అధికారులు
వరదల్లో కొట్టుకుపోయిన మూగజీవిని కూడా
వెతికి పట్టి, వెలికి తీసే మీడియా నేత్రం
ఆకాశానికి నిచ్చెన వేశాం
పాతాళానికి లోతులు నేర్పాం
కాని...
ఆ కఠినాత్ముల కుటిల నీతికి బలై
మాడి మసైపోకముందే నిను చేరలేకపోయాం
క్షమించు వైష్ణవీ...
తోడుగా ఉంటాడని
డాడీని పంపామనుకుంటున్నావా?
మా 'సమర్థత'ని అపహాస్యం చేస్తూ
డాడీయే నీ దగ్గరకు వచ్చేశారు.
దేవుళ్ళందరితోనూ చెప్పు చిట్టితల్లీ...
మీరు చంపిన రాక్షసులందరు
భూలోకంలో మళ్ళీ పుట్టారని
మీ కన్నులనే మాయ చేస్తూ
మనుషులమని చెప్పుకుంటున్నారని.
| Read 9 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|