TeluguPeople
  are the trend-setters

 
Articles: Devotion
అహం వీడితే సుఖం!
- Site Administrator
  Page: 1 of 1    
శ్రీ సాయి పథాన్ని చేరుకోవాలంటే మొదట మన అహాన్ని బాబా పాదాల వద్ద పెట్టాలి. అహం లేని బాబా షిరిడీ పుర వీధుల్లో 'భిక్షాందేహీ' అన్నారు. ఆకలిగొన్న వారికి కడుపునింపారు. అడిగిన వారికి, అడగనివారికి లేదనకుండా అవసరాన్ని కనిపెట్టి పంచిపెట్టారు. అదేపనిగా ఇతరులను నిందించడం, అకారణంగా దురభిప్రాయాలను ఏర్పర్చుకోవడం, తను నమ్మిందే నిజమనే భ్రమలో పొద్దుపుచ్చేయడం, అసూయ, ద్వేషాలతో రగిలిపోవడం, ఓర్వలేనితనంతో విరోధాలు తెచ్చుకోవడం, లేనిపోని భేషజాలతో ఆడంబరాలకు పోవడం, పెద్దల మాటల్ని లెక్కచేయకుండా గర్వంతో ప్రవర్తించడం... ఇవన్నీ దుర్లక్షణాలు. మనసులో అంతర్లీనంగా గూడుకట్టుకుని ఉండే అహం అనే పొర ఈ లక్షణాలను కలిగిస్తుంది. ఈ దుర్లక్షణాలను వెంటనే సరిదిద్దుకోవాలని బాబా నొక్కి చెబుతుండేవారు. మనసును మాలిన్యం చేసే ఈ అవలక్షణాలను తొలగించుకుంటే ప్రతి ఒక్కరి మనసులు షిరిడీ శోభతో ప్రకాశిస్తాయి. ఆత్మసాక్షాత్కారానికి అడ్డుగోడలుగా నిలిచే ఈ దుర్బుద్ధులను తుడిచి పెట్టేయాలంటే శ్రీ సాయి నామస్మరణే ఏకైక మంత్రం. శ్రీ సాయినాథాయ నమ:

Read 1 Comment(s) posted so far on this Article!

  Page: 1 of 1    



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.