TeluguPeople
  are the trend-setters

 
Articles: Poetry
గుండె చప్పుడు
- mitra sailaja
  Page: 1 of 1    
నేను నేనుగా నిన్ను చూసినప్పుడే నీ నువ్వుగా మారాను నీకు నువ్వుగా నన్ను పలకరించినప్పుడే నా నవ్వుగా మారావు నీకు నాకు నడుమ అక్షరం ఆలంబన అయితే నా గుండెలో భావాలు విరిసే పుష్పాలుగా మారాయి కదులుతున్న కాలంలో నీ కలం కమనీయమయితే నీ కోసం నిరీక్షించే నా కన్నులు రమణీయతను చాటుతున్నాయి అద్దంలో మనిషి ముఖం కనిపిస్తే ప్రేమించే హృదయంలో మనసు రూపం కనిపిస్తుంది ఒకచోట నిలబడని ఊహ ఒకనాటికి అంతమవని అజ్ఞానం ఒకేసారి పలకరించే అనురాగం ఒకే క్షణంలో పోయే ప్రాణం ఇలా ఒక్కొక్కసారి జరిగే కదలిక ఎక్కడికక్కడ తలుపులు తెరుచుకుని తలపులే వేదికగా ఎప్పటికప్పుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాయి.. జీవితం నుండి, హృదయ స్పందన వరకు వదలలేక వదిలి తిరుగుతున్న గుండె చప్పుడు మరింత వేగాన్ని పెంచినా కించిత్ మెరుపు వేగంతో చీకట్లను చీల్చుతూ వెలుగుల్ని చిత్రిస్తూ నా చుట్టూ నీడలు నీ ఆకారంలోనే ఉన్నాయి అవును ఇపుడు నాలో కనిపించేది నేను కాదు నాలో వినిపించేది నా స్వరం కానే కాదు ఓ.. మనసు చైతన్యం.. ఓ.. మానవత్వపు మహోదయం నా స్తంభించిన గుండెను నడిపిస్తున్న ఒక తరంగం అదే నాకంటూ మిగిలిన స్వచ్ఛమైన గుడి గోపురం...!

Read 8 Comment(s) posted so far on this Article!

  Page: 1 of 1    



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.