|
|
Articles: Devotion | mananaM - Mr. Ramakantha Rao Chakalakonda
| |
చెదరిన కలలు ఎదలో తలచి, చింతను చెందకు ఓ సుమతీ
మదిలో మాధవ రూపము నిలిపి, మననము చేయుటే మన రీతి.
1. గత మధనములో గుండెలు అవిసి
పతనము కాకు పామరుని గతి
సతతము శ్రీహరి నామ పాననా
జతనము చేయుము చిక్కగ సుగతి. ||చెద||
2. వ్యధలు బాధలే ప్రతి హృదయములో
ఏదో బాసిన వదలని స్మృతులే,గుండెల
గాధలు తొలిచెడి రొదలే,
మది హరి పథమున మలచుటే నీతి.. ||చెద||
3. ముందున పొందెడి మన్నన, బహుమతి
పొందుగ మదిలో సంభావించి
అందుము అవగత ఆనందాకృతి
విందుగ శ్రపతి పొందును సుమతి. ||చెద||
చాకలకొండ రమాకాంతరావు Cincinnati, OH USA
September 27, 2006
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|