|
|
Articles: Devotion | inkoka varshamu - Mr. Ramakantha Rao Chakalakonda
| |
జన్మదిన గానము
వచ్చెను పై బడి యింకొక వర్షము
తెచ్చెను ఏమిటి తీరిన కాలము. ||వచ్చెను||
1. వయసులు మీరి వగ్గుగ మారగ
కాయము కృంగి రోగము పొంగగ
మాయను వీడక మది విలపించగ
చేయుట ఎటులో శ్రీహరి ధ్యానము. ||వచ్చెను||
2. ఏండ్లు దొర్లగ ఏబది మీరగ
వీడదు మనము వాసన లేశము
పాడిగ చేయదు పరమాత్ముని నుతి
వేడదు ఏడు కొండల వాడిని. ||వచ్చెను||
3. నయనము లందు నాణ్యత తరగగ, అవ
యవ చలనము అవశము చెందగ, భవ
భయ సాగర తరణిగ వచ్చి
నయమును గూర్చునా నారాయణుడు ? ||వచ్చెను||
4. ఆయువు తగ్గగ అలసత పెరుగగ
మోయని భారమై కాయము వగ్గగ
తోయజ నేత్రుడు తిరుమల రాయుడే
జయముకు దగ్గర చేర్చును నిగ్గుగ. ||వచ్చెను||
చాకలకొండ రమాకాంతరావు
September 29,2006 Cincinnati, OH USA
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|