|
|
Articles: Devotion | evarikevaru... - Mr. Ramakantha Rao Chakalakonda
| |
ఎవరి కెవరు సొంతము యీవింత జగతిలో
రాదు రాదు సుంతము, భ్రాంతి అంత మోహము. || ఎవరి||
1. భార్య రాదు, భర్త రాడు నీ చివరి ఘడియలో
రారు కన్న తల్లి, తండ్రే , రారు పుత్ర పౌత్రులు,
వారలకై ఆరాటము, విత్తము కై పోరాటము,
వర వెంకట పతి నామము వెరవరికే సొంతము. || ఎవరి||
2. తనువులపై ఎందులకు తగని యీ మోహము,
మేనాలు మిద్దెలు మిగులునవా గాంచుము,
ప్రాణాలు వున్నపుడే పొందుము పరమార్ధము
అనుకొన్న అచ్యుతుని ఆశ్రయమే సొంతము. || ఎవరి||
3. వ్యర్ధమైన వ్యామోహము వీడుమిక శాంతము
అర్ధముకై చేయకు అకృత్యపు కార్యము,
స్పర్ధలన్న సంకుచితము, సమభావమే దివ్యము
స్వార్ధము విడనాడిన సంతసమే సొంతము. || ఎవరి||
4. మనసులోన మాధవుని మరువకుండ కొల్వుము
ధ్యానములో దివ్యమైన అనుభవము గాంచుము
పనిలోన, పాటలోన పరమాత్ముని తల్చుము
విను వెంకటపతి యిచ్చే వరములు నీ సొంతము. || ఎవరి||
చాకలకొండ రమాకాంతరావు Cincinnati, OH USA,
May 18, 2006
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|