|
|
Articles: Devotion | NadaBrahma - Mr. Ramakantha Rao Chakalakonda
| |
నాద బ్రహ్మలే మాకు నయముగ నేర్పిన, నారాయణ నామ మధుర గీతం, నా
రద ప్రముఖులు నిత్యము నుతియించు, నిర్మల నర్మిలిత మధుర నామం. || నాద||
1. సరిగమ స్వరములు సంగీత సుధలుగ గమకములై పల్కిన మధుర నాదం,
సిరినాధు సన్నతిన శృంగార రాగముల సన్నాయి నాదముల సరళ గానం. || నాద||
2. పదములే పాటలై, పల్లవితో గాత్రములో పొంగి పొరలగ ప్రేమ ప్రణయ గీతం,
ఎదలోన ఎన్నేన్నో భావాల గువ్వలు ఎగిరి సవ్వడి చేయు సరళ రాగం. || నాద||
3. వెంకటాద్రి పతి మంగళా శాసనము విని పించమన్న యీ విమల గీతం,
పంకజనాభుడు పరమ ప్రసన్నుడై పరమపద మిచ్చెడి ప్రణవ నాదం. || నాద||
చాకలకొండ రమాకాంతరావు Cincinnati, OU USA
Jan 7, 2006
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|