|
|
Articles: Devotion | mA hRudayaM - Mr. Ramakantha Rao Chakalakonda
| |
మారెనుగా మా హృదయము మహభాగ్యము
తీరెనుగా సంతాపము ఎద తాపము
చేరువగా శ్రీహరిని కాంచిన క్షణము
తిరుమలలో దోరికెనుగా సంతోషము. ||మారెను||
1. కేశవుని కన్నులతో కాంచిన క్షణము
నాశమాయె నా పాపము నిజముగ సగము
ఆశగ శ్రీ పురుషుని చూచిన క్షణము
మాసెను మా పాపము మరి యొక సగము ||మారెను||
2. అంజలి గొని ఆ ధేవుని మ్రొక్కిన క్షణము
భంజన మయె మదిలోని తాపము సగము
రంజకమగు ఆ నామము పల్కిన క్షణము
మంజిమముగ మాసెను మరి యొక సగము. ||మారెను||
3. తిరుమలను మదిలోన తలచిన క్షణము
తరిగెనుగ మది భారము తియ్యగ సగము
హరి చరణములందు మ్రొక్కి వేడిన క్షణము
హరి యించెను ఎద భారము సర్వము నిజము. ||మారెను||
చాకలకొండ రమాకాంతరావు Cincinnati, OU USA
Sept 20, 2006
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|