|
|
Articles: Devotion | ఏడు కొండలవాడ మేలుకో - Mr. Ramakantha Rao Chakalakonda
| |
ఏడు కొండలవాడ మేలుకో, వేడితిమి అయ్యా మేలుకో,
ఏడేడు లోకాల భక్తులు ఎందరో, చూడగ వచ్చిరి మేలుకో. || ఏడు||
1. అచ్యుత యని నిన్ను అతి భక్తి వేడగ,
ఉత్యగించిరి వారు మేలుకో,
నిత్య నిర్మల రామ, నారాయణ కృష్ణ,
సత్య నారాయణ మేలుకో
సత్య నారాయణ మేలుకో ||ఏడు||
2. శ్రీరంగ, గోవింద, శ్రిత జన రక్షక,
ఆర్త పరాయణ మేలుకో,
కరి రాజ రక్షక, కేశవ, మాధవ,
కరుణతోటి మమ్మేలుకో,
కరుణతోటి మమ్మేలుకో ||ఏడు||
3. గోపాల, శ్రీధర, గోకుల రక్షక,
రేపల్లె లేచెను మేలుకో,
మాపాలి దేముడ, మావెంకటేశ్వర,
నీ పాద దాసుల నేలుకో,
నీ పాద దాసుల నేలుకో. ||ఏడు||
చాకలకొండ రమాకాంతరావు Cincinnati, OH USA
January 8, 2006
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|