|
|
Articles: Devotion | konDalarAyuni... - Mr. Ramakantha Rao Chakalakonda
| |
||పల్లవి|| కల్యాణ వేళలో కోండల రాయుని
కళలు గన మనకు యీ కన్నులు చాలునా. ||కల్యాణ ||
|| అను|| మెరుపు తుణకల మధ్య నల్లని మేఘముల
ముదితల మధ్యన మాధవుని గనుమా. ||కల్యాణ||
1. కలికి అలమేలు కనక కాంతుల మెరయ
నెలత పద్మావతి నయగార మొలకగ
కలికి కిరీటముతో కోదండ రాయుడు
అలికిడి లేకుండ అమరె మధ్యన గనుమా ||కల్యాణ||
2. ఇంద్రచాపము వంటి యిద్దరు అతివలు
చంద్రుని మించిన చల్లని చూపులతో
అందముగ అలరార, అంగనల నడుమ,
ఇందిర నాధుని చందము గనుమా. ||కల్యాణ||
3. నంగ నాచిగ నవ్వె నెలతి నాంచారమ్మ
బుంగ మూతిని తిప్పె పడతి ఆండాళమ్మ
సింగార మొలకగ సిగ్గు మొగ్గల వారి
సంగ తెరిగిన మన రంగని కనుమా. ||కల్యాణ||
4. కమల క్రీగంటితో కనుసన్న చేయగ
నెమ్మిగ భూదేవి నాధుని చూడగ
అమల మగు చూపులతో అందరిని గాంచెడి
విమల వెంకటపతి వైభవము గనుమా. ||కల్యాణ||
5. అనురాగ మాలికగ అమ్మ అలమేలుండ
కన్నప్రేమతో కొమ్మ పద్మావతుండగ
అన్ని సమకూర్చును అల వెంకటేశుడే
ఎన్నేన్నో శుభములు యిక వారి గొల్వుమా ||కల్యాణ||
చాకలకొండ రమాకాంత రావు, Cincinnati, OH, USA
February 24, 2006
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|