|
|
Articles: Devotion | pUlangi sEva - Mr. Ramakantha Rao Chakalakonda
| |
పూలంగి సేవ 2005 సందర్భంగా వేంకటేశుడు వ్రాయించిన పాట యిది.
పూలంగి సేవలు పద్మనాభునికే, మరు
మల్లె దండలు మాధవుని మెడకే. ||పూలంగి||
1. చామంతి పూలతో చక్కగా మరువాలు, ప
రిమళము వెదజల్ల జతగ కూర్చెదము, ఘుమ
ఘుమలు వొలుకగ గుండు మల్లెలు గుచ్చి, వ
నమాలి మెడలోన సరము వేసెదము. ||పూలంగి||
2. దాసాని పూలతో దేవకాంతము గూర్చి,
మాసామి మెడలోన మాల వేసెదము,
కొసన కనకాంబరము, సనజాజి సరిగూర్చి,
వాసనలు వెదజల్ల వరుస గుచ్చెదము. ||పూలంగి||
3. సంపంగి పూలతో, పొగడాలు కమలాలు
ఇంపుగ జతకల్పి మాల జేసెదము,
సొంపు లొలకగ హరి పన్నీటి పూలతో
వంపుల మాలను వెలయ జేసెదము. ||పూలంగి||
4. గోపవర్ధన ధరుని గళము ఘుమ ఘుమలాడ
గోవర్దన పూలు గూర్చి వేసెదము, నం
దివర్ధనముతో నల్లనయ్య మెడలో
సంవృద్ధి సమకొన సరము వేసెదము. ||పూలంగి||
చాకలకొండ రమాకాంతరావు Cincinnati OH USA
Dated: October, 22, 2005
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|