|
|
|
|
Articles: Devotion | మహాత్ముల ప్రేమ అనంతం - Editor
| |
(శ్రీమతి లీలావతి)
మనకు ఎవరైనా, ఏ విషయంలోనైనా సహాయం చేస్తే, 'ఎప్పుడు వారికి కృతజ్ఞతలు తెలుపుకుందామా' అని ఎదురు చూస్తూ, వారు మనకు చేసిన సహాయాన్ని ఎంతో గొప్పగా అందరికీ చెప్పుకుంటుంటాము.
మరి మహాత్ముల యెడల కాస్తయినా కృతజ్ఞతలు చూపుతున్నామా?
వారు మనకు నిరంతరమూ తమ కృపను అందిస్తున్నా కూడా మనం వారిని గుర్తుంచుకోము.
మహాత్ముల ప్రేమ అనంతం. విశ్వాసంతో ఒక్కసారి వారి సన్నిధికి చేరితే చాలు. వారి కృప మనకు ఎల్లప్పుడూ అన్ని పరిస్థితులలోనూ ఉంటుంది. మనలను నిరంతరం కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటారు. కానీ మనము మాత్రము వారిని అంతగా గుర్తుంచుకోము. మనకు అవసరమైనప్పుడు మాత్రం వారి దర్శనం చేసుకోవడం, లేకపోతే మన పనులలో మనముంటాము. కానీ వారు మాత్రం ఎందరు భక్తులు ఉన్నా అందరిపైనా తమ కృపాదృష్టిని ప్రసరింప చేస్తూనే వుంటారు.
పాటిల్ భాయి అనునతడు శ్రీ సాయిబాబాకు భక్తుడు. అతడు పేదవాడు. ఒకసారి బాబా, అతడిని చూసి నవ్వుతూ 'నువ్వు గొప్ప ధనవంతుడివై బొంబాయిలో పెద్ద భవనం కట్టిస్తావు. అప్పుడు గృహప్రవేశానికి అందరితోపాటు నన్ను కూడా పిలవాలి' అన్నారు.
దానికి అతడు 'బాబా! ఎందుకు ఎగతాళి చేస్తారు? అటువంటిది కలలో కూడా జరగదు' అన్నాడు.
చుట్టూ వున్న భక్తులందరూ కూడా, బాబా అలా ఎగతాళికి అన్నారని నవ్వుతూ 'మమ్మల్ని కూడా బాబాతో పాటు పిలవాలి' అన్నారు వ్యంగ్యంగా.
ఇది జరిగిన కొన్నాళ్ళకు అతడు నిజంగానే ధనవంతుడై బొంబాయిలో పెద్ద భవనం కట్టించాడు. గృహప్రవేశానికి అందరినీ పిలిచాడు గానీ బాబాను మాత్రం పిలవడం మరచాడు.
కానీ ఆ కరుణామూర్తి తన భక్తుడిని ఆశీర్వదించడానికి భిక్షకుని రూపంలో అతడి ఇంటికి వెళ్ళారు.
మధ్యాహ్నం పూట ఆ భిక్షకుని రూపంలో ఉన్న బాబా, 'భిక్ష ఇవ్వండి వెళ్ళాలి' అని ఇంటివారిని తొందర చేశారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|