|
|
Articles: Poetry | నెలరాజా తొందరేల? - divya tummala
| |
నెలరాజ నీకేల ఇంత తొందరా
నువ్వు సూరీడు పోక ముందే వచ్చావేమిరా
అరుణుడు అస్తమించలేదే
ఇంతలోనే నీవు వచ్చినావే
ఇరువురు ఎదురుపడితే అపుడేమౌనురా
తారలు కూడా తోడు లేవే
వెన్నెలనైనా వెంట తేవే
ఇటు ఒంటరివై రాబోకురా
కలువలు కనులు తెరువలేదే
నీకై వేచి చూడలేదే
విరహము తాళలేక వచ్చావా చెప్పరా
నిశి జాడే కానరాదాయె
నీకోసం తను రాదాయె
ఆకాశ వీధిలో
అరుదైన యానమే
చేయగోరావా చెప్పరా
భాస్కరునితో నెయ్యమా
పగటితో నీకు పంతమా
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|