|
|
Articles: Drama | ప్రేమ దొంగలు... - Mr. GodDevendra GodDevendra
| |
[ఇక్కడ్నించి సుందరం స్వగతం ఏక పాత్రాభినయం]
సుం:- హుఁ! అందరికీ గ్రీన్ సిగ్నల్స్!ఏడుకొండలికి గ్రీన్ సిగ్నల్! అవతారం గాడికి గ్రీన్ సిగ్నల్! ఆఖరికి నా రూమ్మేటు గాడికీ గ్రీన్ సిగ్నలే! కాని.. కాని... నాకు మాత్రం ప్రేమలో ఓ పెద్ద డేంజర్ సిగ్నల్! రెడ్ లైట్!! ఛి! ఇంక నేనెందుకు బతకాలి? ఎవరికోసం బతకాలి? కష్ట పడి తయారు చేసుకున్న నా రెడీ రెకనర్-నా లవ్ మేడ్ ఈజీ!- అందరికీ పని చేసి నాకు మాత్రం ఎందుకూ పనికిరాకుండా పోయింది! ఇటువంటి ప్రేమరాహిత్యపు జీవితం కొన సాగిచేకన్నా -- చనిపోయి దేవుడి ప్రేమ సామ్రాజ్యంలో కడుగెట్టడం ఉత్తమం!
{సుందరం ఒక నిర్ణయానికొస్తాడు. టేబుల్ దగ్గర కెళ్లి డ్రాయరు సొరుగులోంచి పాయిజన్ అని రాసున్న సీసా తీసి, టేబుల్ పై వుంచుతాడు. పక్కనే గ్లాసుతో మంచినీళ్లు పెట్టుకుంటాడు. పాయిజన్ సీసాలోంచి ఒక మాత్ర తీసి గొంతులో వేసుకుని మంచినీళ్లు పోసుకుని ఓ గుటకేస్తాడు. ఇంతలో ఏదో ఆలోచనొచ్చి - కాగితం కలం తీసుకుని ఏదో రాస్తూ, ఒక్కో మాత్రా గొంతులో వేసుకుని మధ్య మధ్య లో నీళ్లు తాగుతుంటాడు. అతను ఉత్తరం రాయటం పూర్తి చేశాడు. పది మాత్రలైనా మింగుంటాడు. ఇప్పుడు సుందరం ముఖం కళా విహీన మౌతుంది. విపరీతమైన చెమటలు పడుతున్నాయి. బాధతో మెలికలు తిరుగుతున్నాడు. అతి కష్టం మీద కుర్చీలోంచి లేచి వచ్చి మంచంపై నురగలు కక్కుతూ వాలి పోతాడు. చేతిలో అతను రాసిన ఉత్తరం గుప్పిట బిగుసుకుని నలిగి పోతుంటుంది.}
(ఇంతలో ప్రకాశం ఎమ్.బి.లోంచి అరుచుకుంటూ వస్తాడు.)
ప్ర:- ఒరే! సుందరం పది నిముషాలూ అయిపోయాయిరా!
(లోపలికొచ్చిన ప్రకాశం సుందరాన్ని చూసి షాక్ తింటాడు.) ఒరే! సుందరం! ఏమైందిరా? ఏమైంది?
[సుందరం తన చేతిలోని కాగితాన్ని ప్రకాశం చేతిలో పెడతాడు. సుందరం రెండో చేతిలోనున్న 'పాయిజన్' సీసాని ప్రకాశంలాక్కుంటాడు.]
ప్ర:-'పాయిజన్ ' - (అని గట్టిగా చదివి, కెవ్వున అరుస్తాడు.)
ప్ర:- అయ్య బాబోయ్ ! కొంప మునిగిందిరోయ్! ఒరే అవతారం!ఒరే ఏడు కొండలూ అందరూ రండిరా! మన సుందరంగాడు కొంపముంచేశాడురా! విషం మింగి చచ్చిపోతున్నాడురా!
( కంగారుగా మెయిన్ పాసేజిలోనికి చూస్తూ గట్టిగా కేకలేస్తాడు. ఏడుకొండలూ-అవతారం ఎమ్.బి.లోంచి రివ్వున దూసుకొస్తారు.)
ఏ:- అయ్యబాబోయ్! ఇప్పుడేం చేసేదిరా?
శే:- వాడు ఛస్తే మన పీకట్టుకుంటుందిరా! ముందు వాడేమైనా ఉత్తరం రాశాడేమో చూడు.
ప్ర:- ఇదిగో ఉత్తరం ! చదువు.
శే:- నాకు ఏనుగా చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. నా ఈ చావుకి ఎవరూ కారణం కాదు.(ఉత్తరం చదవడం ఆపి) హమ్మయ్య! బతికించాడ్రా! (గుండెలు రాసుకుంటాడు,)
ఏ:- ఇంకా ఏటి రాసినాడో చదవరా!
(ప్రకాశం ఉత్తరం లాక్కుని చదువుతాడు)
ప్ర:- నేను ప్రేమ సోపానాలు ఎక్కబోయి వెల్లకిత్తలా పడ్డాను. నాకు ఏడు కొండలు అంటే ఎంతో ప్రేమ. నేను చచ్చిపోయాక-వాడు ప్రేమ లేఖలు రాసుకోవడంలో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో వందనం పేరిట ఎన్నో ప్రేమ లేఖలు రాసి, నా షెల్ఫ్ లో ఉంచాను. వాడికి అవసరమైనప్పుడల్లా వాటిని తీసి వాడుకోమని కోరుతున్నాను. ఇక పోతే- తాయారు గురించి!- 'తాయారు నన్ను ప్రేమించడం లేదని తెలుసుకున్నాను. అందుకే ప్రకాశం తాయారును పెళ్లాడి కలకాలం సుఖ పడ మని కోరుతున్నాను. ఆమెను ప్రేమగా చూసుకోమనీ-ఆమెకే కష్టం కలిగించొద్దనీ మరీ మరీ ప్రకాశాన్ని కోరుతున్నాను.
శే:- ఆహాఁ! ఎంత సుందర హృదయంబీ సుందరానిది?! మరణ కాలమందు కూడ తన ఆప్తులను మరచినాడు కాడు!!
ప్ర:- ఒరే!ఏంట్రా? నీ వెధవ తెలుగు తెగులు-వాడో మూల ఛస్తుంటేను!?
శే:- సరే! ఇంకా ఏం రాశాడో చదువు.
ప్ర:- ఇంక నా శవం మాటంటారా?- నా శవాన్ని లేడీస్ హాస్టల్లో ఊరేగించండి! హాస్టలులోని అమ్మాయిలందరకూ చాటి చెప్పండి!'ఏ ప్రేమికునీ హింసించి అతని చావుకు కారకులు కావద్ద'ని! నా చితాభస్మాన్ని లేడీస్ హాస్టల్లోని అమ్మాయిలందరికీ పంచిపెట్టండి. నా చితా భస్మ బూడిద దగ్గరుంటే- ఏ పురుషుని నించీ 'ప్రేమ' అనే పదార్థపు ప్రమోదమైనవే తప్పించి ప్రమాదమైన ఘంటికలు విన బడవని చెప్పండి.- ఇట్లు; భగ్న ప్రేమికుడు- మీ ప్రియ సుందరం.
[ ఏడుకొండలు సుందరం నాడి చూస్తాడు.ఆ తర్వాత గుండె పై చెవి ఆనించి వింటాడు]
ఏ:- ఒరే! సుందరం చచ్చిపోనాడు. గుండె ఆగిపోనాది!
ప్ర:- ఒరే! నేనర్జంటుగా వెళ్లి డాక్టర్ని తీసుకొస్తాన్రా!! మీరెళ్లి వార్డెన్ ని పిలుచుకు రండి.
[ప్రకాశం వెళ్ల బోతుంటాడు. ఇంతలో సుందరం కదులుతాడు.చెయ్యి అడ్డంగ ఊపుతాడు.'వద్దు-వద్దు!!' అంటాడు]
శే:- ఒరే! సుందరం చావలేదురా! ఏదో వద్దంటున్నాడు.ఏమిటో చూడరా!
(ప్రకాశం గబ గబా వచ్చి సుందరం చెయ్యి పట్టుకుంటాడు.)
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|