|
|
|
|
Articles: Drama | నరకానికి పూలదారి!? - Mr. pyyetisrinivasarao srinivasulu
| |
సిల్ : ఇలా కొన్నేళ్లు కాలగర్భంలో కలిసిపోయాయి. సాగినంత కాలం చంచలరావు ఆటలు సాగాయి. కాని, ఆ రోజు అతని ఆటలు ఆగిపోయే సమయమొచ్చింది. అతను చేస్తున్న మోసం ప్రభుత్వానికి తెలిసిపోయింది. అతనిపై లంచగొండి అనే ముద్ర వేసి అతడ్ని ఉద్యోగం నుంచి తొలగించింది. ఆ నాడు...
... LIGHTS ON ...
[ఇప్పుడు చంద్రం నూనూగు మీసాల యవ్వనంలోకి ప్రవేశించాడు. అనగా పదహారేళ్ల వయసు. ఫుల్ ప్యాంటు షర్టులో ఉన్నాడు. పూర్వమున్న భయం లేదు. ధైర్యంగా ఆర్.ఎమ్.బి.లోని తన గదిలోంచి బయటకు వచ్చి, బ్రాందీ సిసా గ్లాసూ తెచ్చుకుని టీపాయి మీద పెట్టుకుని, సోఫాలో కూచుంటాడు. సిగరెట్టు అంటించుకుని బ్రాందీ గ్లాసులో పోసుకుని కొద్ది కొద్దిగా సిప్ చేస్తుంటాడు]
సిల్ : అవును. మీ నాన్న అలాగే సిగరెట్టు కాలుస్తాడు. అలాగే పొగ వదులుతాడు. అందులో ఎంతో హాయి ఉంది! ఎంతో హాయి!!
[ఉద్యోగం పోగొట్టుకున్న చంచలరావు నీరసంగా వీధిలోంచి వచ్చి కొడుకును చూసి ఉగ్రుడైపోతాడు]
చం : ఒరేయ్! చంద్రం!!
[చంచలరావు చెయ్యెత్తుతాడు. చంద్రం కంగారుగా సోఫాలోంచి లేచి, తండ్రికేసి భయంగా చూస్తుండగా...]
సిల్ : చంచల్రావ్! నువ్వు కొడుకుని దండించే అర్హతను కోల్పోయావు. నీ అడుగుజాడల్లోనే అతనూ నడుస్తున్నాడు. నీ వంటి పెద్దవాడే పరిసరాల ప్రభావానికి తట్టుకోలేకపోతే, ఒక లేతవయసులోనున్న చిన్నారి హృదయం, ఎలా వీటన్నిటికీ తట్టుకోగలదు? రోజూ నువ్వు చేస్తున్న పనులను పరికించే ఆ లేతమనసు అందులోని సౌఖ్యం ఏమిటో తెలుసుకోవాలని, ఆరాటపడి, బ్రాందీ తాగటం అలవాటు చేసుకుంది. అందులో అతని తప్పేముంది?
... FREEZE RELEASE / (SILHOUTTE VANISHES) ...
చం : బుద్ధి లేకుండా ఇలాంటి పాడుపని చేస్తావురా? ఇడియట్! (లెంపకాయ కొడతాడు)
చంద్రం : (చెంప రాసుకుంటూ) నాన్నా! ఏమిటి నువ్వనేది? ఇది పాడుపనా?! మరైతే నువ్వెందుకు తాగుతున్నావు నాన్నా దీన్ని?
చం : వెధవ ప్రశ్నలేశావంటే ఛంపేస్తాను. పెద్దవాళ్లు చేసే ప్రతి పనినీ చిన్నవాళ్లు చెయ్యకూడదు. నువ్వు కూడా పెద్దవాడివైనాక నీ డబ్బుతో నువ్వు తాగి తందనాలాడు! చావు!! అంతేగాని, నా డబ్బు నీ జల్సాలకు తగలేశావంటే ఛంపేస్తాను! ఫో వెధవా! నాక్కనిపించకుండా అవతలకు తగలడు.
[చంద్రం రోషంగా తల ఎగరేసి వీధిలోనికి వెళ్లిపోతాడు. చంచలరావు బాధగా బ్రాందీకేసి చూసి, అసహనంగా బ్రాందీని తీసికెళ్లి అక్కడున్న ఫ్లవర్ వాజ్ లో ఒంపేస్తాడు. వెనక తెల్లతెర మీద సిల్ పడుతుంది]
సిల్ : ఇప్పుడు నీకు బ్రాందీ అంటే అసహ్యం పుట్టిందా చంచల్రావ్? దాన్ని ఒంపేస్తున్నావా? ఇప్పటికే చాలా ఆలశ్య మైంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం లేదు.
[సిల్ vanishes. చంచలరావు బాధగా కుర్చీలో కూలబడతడా. విశాల బాగా టాయిలెట్ అయి వ్యానిటీ బ్యాగ్ తో ఎమ్.బి.లోంచి ప్రవేశిస్తుంది]
వి : ఈ విషయం విన్నావా చంచలరావ్? నీ ముద్దుల నీ చిన్నారి చెల్లెలు పక్కింట్లో ఉన్న కృపానందంతో లేచిపోయింది.
చం : ఏం కూశావే పశువా? నా చెల్లెలు.. నా చెల్లెలు ఎన్నటికీ అలాంటి పనిచెయ్యదు. (విసురుగా లేచి లెంపకాయ కొడతాడు)
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|