|
|
Articles: Drama | తొలకరి పలకరింపులు - Site Administrator
| |
సూరన్న కొడుకు : అయ్యా! ఇదరయ్యా - `స్కానింగు' రిపోర్టురయ్య
ఆడపిల్ల అని ఉంది అందుల - నేనేటీ సేతును - కొడుకు.
సూరప్ప : పంచాంగం అనుకొన్నడేటి స్కానింగు తెలుస్తదేటి?
ఆడపిల్ల కంటదది - మళ్ళ కాపరానికెళ్ళదేటి
ఈసారికి కొదవేటి - మగపిల్లడు పుట్టడా?
ఇల్లుతీసి పందిరేస్తవు - పనిలేదా ఎల్లవేటి?
రార్నాయిన లోపలికి - మేనగోడల్ని సూద్దువు
సూరన్న : ఏటేటి దీనికి - దీని నోటికడ్డం లేదేటి
దీని నాలిక కోసీయ - నా మీద తగువు తోస్తదేటి
నా పంచాంగం గించాంగం - పలచన చేసీసిందిది!
చూడనిస్తదా - మాటాడనిస్తుందా యేటి?
దీనికే కవాలా - నాకక్కర్లేదేటి?
చచ్చినప్పుడేడ్వడాన్కి - ఆ పిల్ల ఉండొద్దేటి? -
సూరప్ప : సావు తెలివితేటలు - ఊరుకోవయ్య నీవి
చెక్కా ముక్కా పట్టుకోని - సొర్గానికి యెలిపోతావేటి
మగోడు లేకపోతే - ఉండదేటిలోకమూ
మగోడు లేని రాజ్యమూ - వస్తాది చూడు ముందు ముందు
నీ నాయనతోటేటి - రార కొడక లోపలికి
ఆడ అని తెలిసింది గదా - చూసొద్దాం కోడల్ని రేపు
సూరన్న : తొందరేల గిందరేల - పురుడవ్వెనె చూసొద్దువు
సూరప్ప : సూడిదలు (తినుబండారాలు) పట్టుకొని - ఎల్లొద్దా యిప్పుడైనా
కదలనివ్వెక్కడికీ - సంవత్సరాలు తరబడీ
లచ్చిందేవి పుడతదని తెలిసీ - వెల్లనివ్వేటీ
లేదంటే... ఇంక `డవుట' - పంచాంగం చూసి సెప్పీ
సూరన్న : పల్లు రాలగొడతానెల్లే - పంచాంగం ఊసెత్తకు
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|