|
|
Articles: Short Stories | స్వర్గ యాతన - Site Administrator
| |
చిన్నమ్మి - కోరాన్ని కాలితో గట్టిగా అదిమిపట్టి ముదర కొబ్బరి చిప్పల్ని గుండగా కోరుతోంది. పెద్దమ్మి పొయ్యి మీద మూకుడు పెట్టి బెల్లం పాకం తీసింది... కొబ్బరి కోరుండలు చుడుతున్నారు. పిల్లలొచ్చి ఒక్కొక్కరు ఒక్కో కొబ్బరుండను నోటగరిచి పారిపోతున్నారు... సుద్దురాయితో వాకిట్లో గీసిన పట్టీల్లో వంటికాలితో గెంతుతూ. జిగట బెల్లం జీళ్ళపాకం పట్టీసినట్టుంది... పిల్లలు వాట్ని నమలలేక బెల్లం చొంగలు కారుస్తున్నారు. వాళ్ళ మూతి మీద జోరీగలు వాలుతున్నాయి. మూతులు తుడిచిన చేతుల్తో చెడ్డీలకు తుడిచి గెంతుతున్నారు. ఈ సంగతి కనిపెట్టిన ముసల్ది-
'అమ్మల్లారా... పాకం ముదిరిపోయినట్టుంది. దాంతో చుట్టిన ఉండలు నవలలేక పల్లూడగొట్టుకుంటారు పిల్లలు... చిన్నతనంలోనే పల్లూడి - జ్ఞానదంతాలొచ్చీసి... బాల బాబాలైపోగలరు... అప్పుడాళ్ళకు మీరు దండమెట్టలేక చావగల్రు...' అంది ముసిల్ది.
'ఆఁ భయ్యం లేదోలమ్మ. నీ మనవలు సామాన్యులు కారు. అయితే రుషులవుతారు... మనూరికి మహాపురుషులవుతారు...' ముసిముసిగా నవ్వుకుంటూ అన్నది చిన్నమ్మి.
'ఆడగుంటలు సాసుపల్లి గున్నమ్మలూ, మగ్గుంటలు గవరయ్యలవుతారు...' అంది పెద్దమ్మి.
'అవునవును...ఇంగిలీజులు పోయారనుకున్నాం... ఇప్పుడు ఆలెవలూ...ఆఁ ఆఁ అమెరికోలూ వచ్చీసినారు, కాల్చిపారీ గలరోరమ్మీ... పిల్లల్ని... ఆల్ని తిట్టీ, వీళ్ళను సపోరుటు చెయ్యడానికి నాగిరెడ్డీ లేడు...శ్రీశ్రీలేడు సుమా. చెడ్డీలు కట్టుకోడంరాని గుంటలు చేతిలో తుపాకీలెట్టీకండి' అని, కచ్చ బిగించుకుంటూ, మూలనున్న బాణాకర్రందుకొని, గబగబా ఎల్లిపోతున్నాడు ముసలయ్య.
'ఓలమ్మిల్లార! మీ అయ్యను చూడండి... కుర్రాడై పోతండు... సాముగరిడీలకు ఎల్తన్నడు...' అంది ముసల్ది.
'ఓలమ్మా! పట్టుకోండి గుంటల్ని. గరిడీలంట దూరి... సాము నేర్చీసి...అట్నుంచొచ్చి... ఆళ్ళకెవరు దొరుకుతారు? మనల్ని బాదీగల్రు... శాన శాన... చిన్నమ్మి.'
'ఓరి... గుంటల్లారా (పిల్లల్లారా) రండర్రో... రండి... కొబ్బరుండలు రడీ... రడీ' పిలిచింది ముసిల్ది.
రానున్న 'దీపావళి'కి ముందు రెండు దపాలు గంపలతో దివ్వెలెత్తి-పాలూ అన్నం పంటకోసం 'ఆకుపచ్చకు' దండం పెడతారు ప్రజలు. అటు ప్రకృతీ ఇటు సామాజిక అడ్డంకులపై కక్ష తీర్చుకొనేందుకు రెండుసార్లు జంతు రక్తంతో ఊరేగి పొలల మధ్య నిలబడి పొలికేకలేస్తారు. పంటలు కోతలకొచ్చే ముందు దీపావళుల మధ్య నిలబడి టపాసులను పేల్చి, దు:ఖాలను కాల్చి చిచ్చుబుడ్లు వెలిగిస్తారు. ఆవేటికి, దసరాకు, దీపావళికీ వెలిగించిన దివ్వెలు - కార్తీకంలో గుండె చెరువుల్లో బరువుగా తూగుతూ జీవితాలకు బరోసానిస్తూ ప్రవహిస్తాయి.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|