|
|
Articles: Short Stories | స్వర్గ యాతన - Site Administrator
| |
కణరూపం నుండి అద్భుత శరీరనిర్మాణంతో విస్తరించిన భూగోళ పదార్ధం - వికసించి, వ్యక్తపరచుకొని మౌనంగా ఉండలేకపోయింది. సంస్కృతీకరించింది. శ్రమను అద్ది శబ్దాలకు రూపునిచ్చి, అందులో తీపినిపోసి తెలుగును శిల్పీకరించి జీవరాసులన్నింటితోనూ ముచ్చట్లాడింది - భూమి, ఒక ప్రదేశాన్ని కాలంతో చుట్టుకొని, ఒక ప్రత్యేక వ్యక్తీకరణను... ఉచ్ఛరించింది. ప్రపంచ శబ్ద పరిణామాల ముచ్చట తెలుగింట తీరాల్సిందే! ఎంత వైవిద్యమంటే అంత 'గొప్ప' భాషకు. జీవపరిణామ 'అద్భుతం' మనిషి చుట్టూ సిద్ధమైపోయిన వైరుధ్యాల సలపరంలో - చిరచిరలలోంచి, చురచురలలోంచి శబ్దించిన శరీరం తన ఆహార్యంలోంచి - ప్రతిరూప 'రచన'లూ అనుకూల శిల్పాలతో భాషను కుప్పతెప్పలు చేసింది. 56 శబ్దాల వద్ద ప్రకంపించి, ఆగమన్నా ఆగలేదు... లిపి చాలక శబ్ద పేటికల్లోనూ, నాలుక రసాంకురాలలోనూ పెనుగులాడుతూ వెలువడుతోన్న అభివ్యక్తిని అందుకోలేక గందరగోళ పడుతోంది నిఘంటువు భాష.
కష్టజీవుల భాషా శబ్దాలకు కొత్తలిపి కావాలి. పరిమిత లిపి జ్ఞానంతో అపరిమిత శబ్ద రుచులను శిల్పించలేం. ప్రజల మధ్య నుంచి వచ్చే రచనలను కాగితాలపై కెక్కించలేమేమో! తెలుగు భాష వివిధ ప్రదేశాలలోని శ్రమజీవన సంస్కృతిలో మిగిలిపోయి ఉంది.
తెలుగుభాషలోని ముచ్చట్లు రాయడానికి నా వల్ల కావడం లేదు. తేనెతో రాస్తాను... నాలుకతో నాకి చదవాలేమొ! నా శరీరంలో నున్న ప్రధాన నాడీ కొనను కాగితానికి ఆనించి, అది ప్రకంపించిన 'గ్రాఫిక్' లిపితో రాస్తాను... గుండెలకు అంటించుకుని చదవాలేమో!
ఈ రనచలోని ఆ చిన్ని 'దేవి'నే... నా 'తెలుగు' దసరా. తెలుగు ఊపిర్లు పొగలు చిమ్ముతున్నాయి.. సమ్మెట మోతలు వినబడుతున్నాయి. తయారవబోతున్న కొత్తక్షరాల కొక్కీలకు 'నా గుండెలు' వేలాడుతున్నాయప్పుడే. నా వాక్యాన్ని పట్టుకొని నన్నెక్కుతున్న కాళికా 'దేవి'ని గుండెలకత్తుకుంటాను. దాని ప్రేమే నాకీ 'స్వర్గ' యాతన... రచన.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|