|
|
Articles: Drama | ప్రేమ దొంగలు... - Mr. GodDevendra GodDevendra
| |
ప్ర:- (ఆనందంగా) నాకు తెలుసున్రా - తాయారెప్పుడూ నన్నే ప్రేమిస్తుందని! (గర్వంగా కాల రెగరేసి ధీమాగా ఫోను దగ్గరకెళ్లి రిసీవరు తీసి డయల్ చేసి) హలో! తాయారుగారూ! నమస్తే! ఇప్పుడే సుందరం చెప్పాడండీ! మీరు నన్ను ప్రేమిస్తున్నానన్నారనీ, నన్నే వివాహం చేసుకుంటానన్నారనీ తెలిసింది .. ఆఁ! (ముఖం వాడిపోగా ఫోను వదిలేస్తాడు)
సుం:- ఏవైందిరా? ఏంటలాగైపోయావ్?
ప్ర:- షటప్!!
సుం:- నిన్నూ అదే మాటందాగురూ?!
ప్ర:- నేను అలాచెప్పమని తాయారుకు చెప్పాను. ఆ విషయం మర్చిపోయి నువ్వు చెప్పింది నిజమనుకున్నాను. షట్టప్పనిపించుకున్నాను.
[శేషావతారం ఏడు కోండలూ పగలబడి నవ్వుతుంటారు. ఇంతలో దూరంగా కారిడర్ లో వార్డెన్ మాటలు వినిపిస్తాయి.]
వా:- (స్టేజీ మీదకు రాకుండానే) హలో మై డియర్ బాయస్!హౌ ఆర్ యూ స్టడీయింగ్? రీడ్ వెల్!ఎగ్జాంస్ కింకా పది రోజులున్నాయి.
తొంగి చూస్తాడు.ఇప్పుడు వార్డెన్ కోటుకి గులాబీ ప్వ్వు వుంటుంది.]
వా:- హలో! రైల్వే ప్లాట్ ఫారమ్! హౌ మెనీ ఆర్ ఇన్సైడ్?(గదిలోకొచ్చి) యూ ఆర్ ఫోర్ ఇన్ దిస్ రూమ్!మందలా ఇంత మందుంటే చదువెలా సాగుతుంది?
సుం:- మేము కంబైన్డ్ స్టడీ చేస్తున్నాం సార్!
అందరూ:- అవున్సార్!
(వార్డెన్ గదంతా పరిశీలనగా చూసి)
వా:- 'ఫెయిల్యూర్స్ ఆర్ ది పిల్లర్స్ ఆఫ్ సక్సెస్!' నాకు ఫెయిల్యూర్స్ అంటే అసహ్యం. పరీక్షల్లోనే కాదు. జీవితంలో కూడా ఫెయిలు అవడం నాకిష్టముండదు. జీవితమే ఒక పెద్ద పరీక్ష అయితే, అందులో ఫెయిల్ అయితే ఇంకేమైనా వుందా? అందుకీఅ-ఐ డిజ్ లైక్ దట్ బోర్డ్! వెంటనే ఆ బోర్డునక్కడ్నించి తొలగించండి.
అందరూ:- (కంగారుగా) రేపు తీసేస్తాం సార్!
వా:- నో! ఇప్పుడే తీసెయ్యాలి!ఏడుకొండలూ నువ్వా బోర్డు తీసి ఇలా పట్రా!
(ఏడుకొండలు బోర్డు తియ్య బోతే అది కాస్తా కింద జారి పడుతుంది. దాని వెనకనున్న సూక్తిని వార్డెన్ చూడనే చూశాడు. ఏడు కొండలు బెరుకుగా ఆ బోర్డుని వార్డెన్ కిస్తాడు. వార్డెన్ బోర్డుని తిరగా మరగా చూసి -చదువుతాడు.)
వా:- 'వైఫ్ ఈఝ్ ది డబల్ ఎడ్జుడు నైఫ్!..'-అందుకే మీరిక పెళ్లి చేసుకోకండి. బావుంది.ఊఁ!-ఏంటిది? అసలు పెళ్లే కాని నాకు చెప్పడానికా ఈ బోర్డ్? మిగతా బోర్డులు కూడా తిప్పండి. నేను చూడాలి.
అందరూ:- వద్దుసార్! అవి మీరు చూడ కూడదు సార్!
వా:- నో..నో-నో! నేను చూసి తీరాల్సిందే!
{భయంగా ఒక్కొక్కరూ ఒక్కో బోర్డుని తిరగేస్తారు. ఏడుకొండలు ఓ దేవుని కాలెండర్ని తిరగేస్తాడు}
వా:- వారెవా! చాలా బాగుంది.-'కిస్ ఈజ్ ది కీ ఆఫ్ లవ్!'- ప్రేమకు ముద్దే తాళం చెవి! ఊఁ! 'లవ్ ఈజ్ ది లాక్ ఆఫ్ లైఫ్!'-ప్రేమనేది జీవితానికి తాళం కప్ప!; ఊఁ! 'డోంట్ మిస్ టు కిస్ ఎ మిస్!'- కన్యని ముద్దాడ్డం ఊఁ .. ఊఁ...! చాలా బాగుంది మీ చదువు. ఇంతవరకూ మీరెంతో ఆదర్శవంతులనుకున్నాను. ఛి!ఛీ! ఈ గోడల నిండా సినీ నగ్న తారలనుంచి హాస్టల్ ని అపవిత్రం చేశారు.మీ వంటి వారుంటే ఈ హాస్టల్ పరువు పోతుంది.
(గబ గబా వెళ్లి అందరూ వార్డెన్ కాళ్ల మీద పడతారు.)
సుం:- ఈ ఒక్క సారికీ క్షమించండి సార్! ఇంకెప్పుడూ ఇలాటి పాడు పనులు చెయ్యం.
శే:- బుద్ధిగా చదువుకుంటాం! మా ఇంట్లో వాళ్లకి రాయకండి సార్!
ప్ర:- మీ ముందే ఈ బోర్డులన్నీ తగలెట్టేస్తాం.రేపొచ్చే పరీక్షల్లో ఫస్ట్ మార్కుల్తో పాసై తీరతాం సార్!
ఏ:-మా అయ్యకి తెలిత్తే చదువు మానిపించి నన్ను తీసికెల్లి గొడ్ల కాడ పారేస్తాడు సార్!
వా: మరివన్నీ తెలిసి ఇలాటి పాడు పన్లెందుకు చేశారయ్యా?
అందరూ:- ఏదో పొరబాటైంది సార్! బుద్ధిగడ్డి తింది సార్! చెంప లేసుకుంటున్నాం సార్! మమ్మల్ని క్షమించండి సార్!!
వా:- (ఫక్కున నవ్వుతాడు. గల గలా నవ్వుతాడు.) మిమ్మల్నందర్నీ క్షమించేశాను. గెట్ అప్!మై డియర్ బోయస్! గెటప్! మీరే రోజు ఏం చేస్తున్నదీ అన్నీ నాకెప్పటి కప్పుడు తెలుస్తూనే వున్నాయి. మీ కిటికీ దగ్గర నిత్యం ఫోన్లు చేసే బవ్య అదే!-'హాఁ ! హతవిథీ! నీ దృక్కులు ఎంత కౄరంబులయ్యెడిన్', నాకు చేరేస్తున్నాడు. మీ మీద నిఘా కోసమే నేనతడ్ని నియమించాను. అంతే కాదు. మీరు చేసే ప్రతి ఫోను కాలూ నా గదిలోకి ఎక్స్ టెన్షన్ లాక్కుని వింటున్నాను. అదేం చిత్రమో రోజూ మీ ఫోను కాల్స్ వింటం వ్ల్ల -'ప్రేమలో ఇంతటి మహత్తర శక్తి వుందా',అనిపించింది. ఎప్పుడూ లేంది. ఈ వయస్సులో నా మనసులో ప్రేమ బీజం నాటుకుంది. అది మహా వృక్షమై కూచుంది.'ఇన్నేళ్లూ నేను నా జీవితాన్ని ఎంత నిస్సారంగా గడిపానూ', అనిపించింది. అందుకే-ఇన్నేళ్ల నా బ్రహ్మ చర్యాన్ని వదిలేద్దా మనుకున్నాను. మీ ట్రాక్ లో మీరు చూపిన రూట్ లో నేను ట్రై చేశాను. ఆయ్ గాట్ సక్సెస్! లేడీస్ హాస్టల్ వార్డెన్ కి నా లాగే ఇంకా పెళ్లి కాలేదు. నేనిప్పుడామెని పెళ్లి చేసుకుంటున్నాను.
సుం:- ఏవిటీ? ఆ అపర కాళికా దేవినా? లేడీస్ హాస్టల్ ముందు మేం తిరుగుతే, గట్టిగా అరిచి భయ పెట్టే ఆ పళ్లెత్తు నల్ల తుమ్మ మొద్దా?!
వా:- షటప్! ఆమె ఇక నా భార్య!
సుం:- అవును సార్! క్షమించండి సార్! బుద్ధి లేకలా అన్నాను.
వా:- ఊఁ! మే గాడ్ బ్లెస్ యూ ఆల్! మీరూ నా లాగే చాలా కాలం బ్రహ్మ చర్యం పాటించాకే వివాహాలు చేసుకోండి. డోంట్ ఫర్ గెట్! అబ్జర్వ్ ఫామిలీ ప్లానింగ్!!!
{ గులాబీ పువ్వు వాసన చూసుకుంటూ వార్డెన్ వెళ్లి పోవును రూమ్‌లోని విద్యార్థులందరూ కొయ్య బారి పోతారు. (స్టిల్)}
[తెర]
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|