|
|
|
|
Articles: Drama | నరకానికి పూలదారి!? - Mr. pyyetisrinivasarao srinivasulu
| |
చం : విశాలా! వద్దు విశాలా!? నా హృదయాన్ని బ్రద్దలు చెయ్యకు. ఇటువంటి దుర్భర స్థితిలో నీవు నన్ను క్షమించకుంటే, నీవు నాకు ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపించకుంటే ... నాకేమీ మిగిలి ఉండదు విశాలా!
వి : ఈ ఇంట్లో ఇంకా ఎవరికైనా ఏమైనా మిగిలి ఉందనుకుంటున్నావా? ఇంక నీ కొడుకు చంద్రం!...
చం : చెప్పకు. చెప్పకు విశాలా! మరి చెప్పకు. నేను పూర్తిగా పతనమైపోయాను విశాలా! పూర్తిగా నాశనమైపోయాను! పూర్తిగా...
[గతంలో ఎక్కడైతే విశాల కూర్చుని తల టేబుల్ కేసి కొట్టుకుంటూ ఏడ్చిందో అదేవిధంగా అదే చోట్లో కూర్చుని చంచలరావు తల టేబులుకేసి కొట్టుకుని ఏడుస్తాడు. ఏడ్పు తగ్గి సాబ్స్ లోకి దిగుతుంది]
... Pause ...
వి : కాసేపు భర్తని అలాగే ఏడ్వనిస్తుంది) ఎందుకా ఏడ్పు?! నువ్వే కాదు. నీ వల్ల ఈ ఇంటిలోని ప్రతి జీవీ పతనమైపోయింది. నేను నువ్వు తయారుచేసిన జీవచ్ఛవాన్నై ఇలా పడి ఉన్నాను. భర్త బతికుండగానే ముండమోపినయ్యాను.
చం : (కోపమొచ్చి ఆవేశంగా) షటప్! నువ్వు ... నువ్వు కూడా నన్ను మాటలని హింసిస్తున్నావు కదూ! గెటవుట్! గెటవుట్ ఆఫ్ మై విజన్!? అందరూ పొండి! అందరూ నాశనమైపొండి. (విశాల రోషంగా తల ఎగరేసి వీధిలోకి వెళుతుంది.) అందరూ నాశనమై పొండి! అందరూ నాశనమైపొండి!!
[అలా ఆవేశంగా గట్టిగా అరవడంతో చంచలరావుకు గుండె నొప్పి వస్తుంది. గుండెలు పట్టుకుని మెలి తిరిగిపోతుంటాడు. టేబుల్ దగ్గరకు అతి కష్టం మీద వెళ్లి బ్రాందీ సీసా ఎత్తి తాగబోతాడు. ఖాళీ సీసా వెక్కిరిస్తుంది. బాధకు తట్టుకోలేక అలాగే వచ్చి సోఫాలో కూలబడతాడు. కంటి చూపులు వెర్రిగా ఉంటాయి. అపస్మారక స్థితి వస్తుంది. (లైట్లు డిమ్ అవుతాయి. అన్ని రంగులూ చిమ్మే స్పాట్ లైట్ పడి గిరగిరా తిరుగుతుంటుంది.) చంచలరావు అనుభవించిన అమ్మాయిలూ, అతని భార్యా , అతని కొడుకూ అతని కళ్ల ముందు కదిలి వెళ్లిపోతుంటారు.]
{ఎమ్.బి.లోంచి గురవయ్య మృత్యువు వేషంలో ప్రవేశిస్తాడు. గురవయ్య తల మాత్రం కనిపిస్తుంది. శరీరమంతా నల్లని గౌనులో ఉంటుంది. నల్ల బూట్లూ - చేతులకు నల్లని గ్లౌవ్స్ - నల్లని గౌనుపై గుండెల మీద VAT-69 బ్రాందీ సీసా బొమ్మ - వీపు మీద ఒక నగ్న సుందరి బొమ్మ - కుడి చేతి భుజంపై కాలుతున్న పొగలు చిమ్ముతున్న ఒక సిగరెట్టు బొమ్మ. ఎడమ చేతి భుజంపైన పొగలు కక్కే 'టీ' కెటిల్ బొమ్మ ఉంటాయి. గురవయ్య వికటాట్టహాసం చేస్తుంటాడు. గురవయ్య వేషంలో వచ్చింది మృత్యువే కనుక అతని కనురెప్పలు మూతపడవు. చంచలరావు శరీరం సోఫాలోంచి స్టిఫ్ గా లేస్తుంది. రెండడుగులు వెనక్కి వేసి గురవయ్యను చూస్తూ}
చం : గురవయ్యా! నన్ను అథొగతికి దిగజార్చి, నువ్వు ఆనందిస్తున్నవు కదూ?! పో! పో!! వెళ్లిపో!! గెటవుట్ వెళ్లిపో!!
మృత్యువు : పిచ్చివాడా నేను గురవయ్యను కాను. మృత్యువును.
చం : గురవయ్యా! పరిహాసానికి ఇది సమయం కాదు. నా కళ్ల ముందు ఏవేవో నీడలు కనిపిస్తున్నాయి. నాకంతా అయోమయంగా ఉంది. నా ఒళ్లు తేలిపోతోంది. ప్లీజ్! నన్ను కాసేపు ఒంటరిగా వదిలెయ్యి గురవయ్యా! ఒంటరిగా వదిలెయ్యి! ప్లీజ్!!
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|