|
|
|
|
Articles: Drama | నరకానికి పూలదారి!? - Mr. pyyetisrinivasarao srinivasulu
| |
మృ : అమాయకుడా! నీ పతనానికి కారణం గురవయ్య అన్న సంగతి అనుక్షణం నీ గుండెలను రగిలిస్తోంది. చావుకు దగ్గరైన ఈ క్షణాల్లో, అపస్మారక స్థితిలో కూడా నువ్వు గురవయ్యను మర్చిపోలేకపోతున్నావు. అందుకే, నిన్ను తీసికెళ్లడానికి వచ్చిన నాలో కూడా నువ్వు గురవయ్యనే చూస్తున్నావు.
చం : అయితే..నువ్వు గురవయ్యవి కావూ? మరి ఎవరు? ఎవరు నువ్వు?!
మృ : చెప్పానుగా! నా పేరు మృత్యువు?!
చం : ఆఁ! మృత్యువా?! నాతో నీకేం పని? గెటవుట్! గెటవుట్ ఐ సే?!
మృ : (నవ్వి) నాకిప్పుడు నీతోనే పని.
చం : నాతో పనా? ఏం పని??
మృ : నిన్ను తీసికెళ్లడానికి వచ్చాను.
చం : నన్నా? ఎందుకు?
మృ : నీ కాలం తీరిపోయింది కాబట్టి!
చం : నాకు కాలం తీరిపోయిందా? నాకింకా వయసు మళ్లలేదే?! ముసలితనం కూడా రాలేదే?
మృ : బాల్య - కౌమార - యుక్త - జరావస్థలతో నాకు సంబంధం లేదు. ఏ వయసులో ఉన్నవారినైనా నేను తీసుకెళ్లిపోతాను.
చం : నన్ను తీసుకురమ్మని ఎవరు పంపారు నిన్ను?
మృ : నీ తీరిపోయిన కాలం.
చం : నాకు కాలం తీరిపోయిందని ఎవరు చెప్పారు నీకు?
మృ : ఎవరూ చెప్పలేదు. అది ఒక ప్రేరణ! అంతే!
చం : క్షమించు! ఇవాళ నాకు తీరికలేదు. రేపు రా!
మృ : నీ తీరికతో నాకు నిమిత్తం లేదు. ఏ వ్యక్తిని ఎక్కడ, ఎప్పుడు, ఎలా కలుసుకోవాలో నాకు బాగా తెలుసు. ఎవరు చేసుకున్న పాపాల్ని బట్టి వారికి నేను ఆయా రూపాల్లో ప్రత్యక్షమై కలుసుకుంటూ ఉంటాను. ఒక ఆఫీసరు దేవాలయానికి వెళ్తుంటే .. ఆయన్ని నేను మధ్య దారిలోనే కలిసి కారు కింద పడేలా చేసి కలుసుకున్నాను. ఒకసారి ఒక పదేళ్ల కుర్రాడిని వాళ్ల వాళ్లు వైద్యం కోసమని ఆస్పత్రికి తీసికెళ్లబోతుంటే.. వాళ్ల ప్రయత్నాలు నిష్ఫలమని తెలుపుతూ... వాళ్లింట్లోనే ఆ కుర్రవాడ్ని కలుసుకున్నాను. ధనికుల్నీ - దరిద్రుల్నీ, పెళ్లి కానివార్నీ - పెళ్లైనవార్నీ, పిల్లలనూ - పెద్దలనూ కలిశాను. ఎందరో భార్యా భర్తలనీ - తండ్రీ కొడుకుల్నీ వేరుచేశాను.
చం : ఇలా ఎంతమందిని కలుసుకుని ఎంతమందిని విడదీశావు?
మృ : నాకు లెక్క తెలీదు. చాలా మందిని! నా దృష్టి నించి ఎవరూ తప్పించుకో లేరు. కరుణా - జాలీ అన్నది లేకుండా ఎన్నో యుగాల నుంచీ చేస్తున్నానీ పనిని.
చం : సమయం సందర్భం లేకుండా ఇప్పుడు నువ్వొస్తే నేనేం చెయ్యగలను చెప్పు?
మృ : నువ్వేం చెయ్యక్కర్లేదు. అన్నీ నేనే చేసుకుని వెళ్లిపోతాను.
చం : అది కాదు! పాపం నా భార్య! జీవితంలో సుఖమనేది ఎరుగదు. నా పిల్లవాడు చెడు తోవలు పట్టి పాడైపోతున్నాడు. వాడ్ని నేను బాగుచేసుకోవాలి. నేనెన్నో పాపాలు చేసి, నా వాళ్లందరికీ తీరని ద్రోహం చేశాను. ఇప్పుడైనా నేను మంచి మార్గంలో నడిచి వాళ్లను ఆదుకోవాలి. ఉద్యోగంలో నేనేం నిలవ చెయ్యలేదు. నేను ఇన్ స్యూరెన్సు కూడా చెయ్య లేదు. బ్యాంకులో పైసా లేదు. నేను లేకపోతే.. నా భార్యా! - నా పిల్లవాడూ పస్తులతో మలమలా మాడి చచ్చిపోతారు. వాళ్ల మీద దయతలచైనా నన్ను వదిలెయ్యి. వాళ్ల భవిష్యత్తుని తీర్చిదిద్ది వస్తాను.
మృ : అది సాధ్యపడదు. నీకిచ్చిన జీవిత కాలంలో నువ్వేదీ సాధించలేకపోతే అది నీ పొరబాటు. ఇంక మాటలనవసరం. నువ్వు సిద్ధంగా ఉండు వెళ్లిపోదాం!
చం : అయ్యో! నా భార్య - నా పిల్లవాడు. మరి వాళ్ల బతుకులు?
మృ : ఎవరి కోసమూ ఈ కాలం ఆగదు. ఇంక వాళ్ల త్రోవ వారిదే!
చం : నేను చచ్చిపోయాక విధవరాలైన నా భార్య పరిస్థితిని చూడాలనుకుంటున్నాను.
మృ : అది నీ వెర్రితనం! నువ్వు చూడలేవు.
చం : సరే! జోళ్లు వేసుకు వస్తాను.
మృ : అవసరం లేదు.
చం : వీధి తలుపు వేసి ఉంది. మరి మనిద్దరం ఎలా వెళ్తాం?
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|