|
|
|
|
Articles: Drama | నరకానికి పూలదారి!? - Mr. pyyetisrinivasarao srinivasulu
| |
మృ : వీధి తలుపు తెరిచే ఉంది. అది మూసుకున్నా తెరుచుకున్న ఒకటే! మనం వెడానికేం ఇబ్బంది ఉండదు. కిటికీలోంచి వెళ్లిపోగలం. అదీ లేకుంటే ఈ గోడ మధ్య నించి దూసుకు వెళ్లిపోగలం. మనం వెళ్లటానికివేవీ అడ్డం రావు.
చం : బాగానే ఉంది. మరి, నువ్వు నన్ను తీసికెళ్లే ఆ కొత్త చోటు ఎలా ఉంటుంది?
మృ : నిన్ను తీసుకువెళ్లటమే నా వంతు. ఆ తరువాత ఏముంటుందో ఏం జరుగుతుందో నాకు తెలీదు. నేనూ ఎపుడూ చూడలేదు. ఊఁ! బయల్దేరు.
(మృత్యువు వికటాట్టహాసం చేస్తుంది)
చం : నో! నేను రాను. నేను రాను! నేను రాను!!
[మృత్యువు చేయి పైకి ఎత్తును. చంచలరావు ఇందాక ఎలాగైతే లేచి ఆ చోట్లోకి వెళ్లాడో, అలాగే స్టిఫ్ గా నడుచుకుంటూ వెళ్లి, సోఫాలో యథా స్థానంలో కూచుంటాడు. కళ్లు తేలవేస్తుంటాడు. ఇక్కడ లైటింగ్ టెక్నీషియన్ స్టేజి ఎదర నుండి ఒక జ్యోతిని స్లైడ్ ద్వారా చంచలరావు గుండెల మీద పడేలా చేస్తాడు. ఆ జ్యోతి మృత్యువు చాచిన చేతి మీదుగా పయనించి, మృత్యువు గుండెపై ఆగుతుంది. మృత్యువు తన చేతిని తన గుండెపైకి తీసికెళ్లి ఆ జ్యోతిని ఆర్పుతుంది. అంటే, చంచలరావు ఆత్మ జ్యోతి మృత్యువులో విలీనమైందన్న మాట. మృత్యువు మెల్లిగా వెనక్కి వెళ్లిపోతుంది. ఈ నేపథ్యంలో నక్కల హూళలు .. ఆ తరువాత ఒక ఫ్యాక్టరీ సైరన్ మోత వినిపిస్తాయి.]
.... FULL LIGHTS ON ....
[చంచలరావు కొడుకు చంద్రం చేతిలో బ్రాందీ సీసాతో తాగిన మైకంలో ప్రవేశిస్తాడు. ఆర్.ఎఫ్.లోకి వెళ్లబోయి తండ్రిని చూస్తాడు]
చంద్రం : ఓహ్! డాడీ నువ్వా?! గుడ్ మార్నింగ్ డాడీ! మందు చాలా రుచిగా ఉంది. కాస్త రుచిచూస్తావేంటి? అబ్బే వద్దులే! మళ్లీ నువ్వు లేచావంటే నాకు మిగల్చకుండా మొత్తం పట్టేస్తావు. అంతే కాదు. మళ్లీ నేను నీ అడుగు జాడల్లో నడుస్తున్నానని కొడతావు. తాగుతున్నానని ఛంపేస్తావు. అందుకే అలాగే నిద్రపో! టేక్ రెస్ట్! శుభ్రంగా విశ్రాంతి తీసుకో నాన్నా! విశ్రాంతి!...వి-శ్రాం-తి!!
(పొరబాటున చంద్రం తన తల్లి గదిలోకి వెళ్లబోయి, ఆగి)
చంద్రం : ష్! అమ్మ గది కదూ? తప్పు... (అని అంటూ ఎమ్.ఆర్.ఎఫ్.లో ఉన్న తన గదిలోనికి వెళతాడు)
... SYMBOLIC MUSIC STARTS ...
[విశాలాక్షీ - గురవయ్యా బాల్ రూమ్ డాన్సు చేసుకుంటూ ఎల్.ఎఫ్. లోంచి గదిలోకి ప్రవేశిస్తారు. మ్యూజిక్ కి అనుగుణంగా స్టేజి మీద రెండు మూడు రౌండ్లు కొడతారు. ఇంతలో గురవయ్య సోఫాలో ఉన్న చంచలరావుని చూస్తాడు. అదిరి పడతాడు]
గురవయ్య : ఓహ్! యువర్ హజ్ బెండ్!! నీ భర్త!... నీ భర్త!!
విశాల : (మత్తుగా) ఏం ఫర్వాలేదు. రండి. ఆయన చూపించిన తోవే ఇది నాకు. ఆయన ఏమీ అనుకోరు. పైగా ముచ్చటపడతారు. కదూ హబ్బీ! ఊఁ!? నువ్వు కూడా రా హబ్బీ! కమాన్! మనం ముగ్గురం కలిసి డాన్సు చేద్దాం! హల్లో డియర్!
{విశాల భర్త భుజంపై చెయ్యి వేసి కుదుపుతుంది. చంచలరావు సోఫాలో ఒరిగిపోతాడు}
... SYMBOLIC MUSIC ENDS ...
{విశాల అడుగులో అడుగు వేసుకుంటూ వెనక్కి వెళ్లి కెవ్వున అరిచి గురవయ్య భుజం పైన వాలుతుంది. గురవయ్య విశాలను పురుగును చూసి దులిపినట్లుగా తోసివేసి నిలబెడతాడు. విశాల భర్త దగ్గరకు వెళ్లబోయి ఆగుతుంది}
[Silhoutte పడుతుంది. స్టేజి మీద లైట్లు బాగా డిమ్ అవుతాయి]
సిల్ : విశాలా! కాలుజారిన నువ్వు అదే పవిత్రతతో నీ భర్తను తాకలేవు. అందుకు నీ అంతరాత్మ కూడా అంగీకరించదు.
[ఇప్పుడు విశాల తన చేతిని గురవయ్యకందించాలని చూసి చెయ్యి చాస్తుంది]
సిల్ : గురవయ్య నీకు చేయూతనిచ్చేటంతటి అవివేకి కాడు. అతను లాభం లేని పని ఏదీ చెయ్యడు. ఒకసారి పొందిన స్త్రీని మళ్లీ మళ్లీ కోరుకోడు. అతను ఆడే జీవిత చదరంగంలో మీ లాంటి వాళ్లందరూ పావులు.
[గురవయ్య చిరాగ్గా కోటు దులుపుకుని వీధిలోనికి వెళ్లిపోతాడు. విశాల అక్కడే కుప్ప కూలిపోతుంది]
[ఇప్పుడు స్టేజి మీద లైట్లు పూర్తిగా ఆరిపోయాక]
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|