|
|
Articles: Devotion | శ్రీ సాయినాథ టేక్డి - Mrs. seetha suri
| |
అంతర్నిహితుడు ఒకడే సాయి, ఆనందానికి మూలం సాయి
అతని ఊహలు - అతని వాక్కులు అద్భుతమోయి,
అలరించునోయి- అందరి మనసులు అలరునోయి
చెప్పక చెప్పాడు ఆ పరమాత్ముడు, ఆద్యంత రహిత పరబ్రహ్మము తానని
ఆత్మ పరమాత్మలూ వేరు కావని, అన్తరాత్మని తరచి చూడమని జీవుల రక్షణే తనకు ధ్యేయమని,
జీవన్ముక్తికయి పాటుపడెదనని, జీవుల మదిలో ఉండిపోదునని
జన్మలు కావవి, కర్మ రాహిత్యాలు కర్మలు చేసిన పాపము తొలగును
ఎవరిని ఎచట ఎలా చూడాలో బాబా తెలుపును ఎంతో దయతో ఎవరికి వారితో
రాజులు పేదలు ఒకటే అనెను రోగాలను తన స్పర్శతో బాపెను
యోగసిద్ధి కలవాడు - ఆ శిరిడీ నాథుడు
భక్తుల పాపాలు తానే భరిస్తాడు - ఆ పయి వరమిస్తాడు
ధనాపేక్ష లేనివాడు - దాక్షిణ్యము కలవాడు - దక్షిణలడిగి మన బాధలు తొలగిస్తాడు
ఫకీరులా వచ్చాడు - పరమాత్మే అయినాడు శిరిడీ గ్రామాన్నే పుణ్యక్షేత్రం చేశాడు
మహా పవిత్రం చేశాడు
నన్ను నమ్మిన వాళ్లే నా వాళ్ళన్నాడు పంచశూన యాగం పరమార్థం తెలిపాడు
పాతకాలు బాపాడు - పరిహారం చూపాడు
పరబ్రహ్మ తానే అయి ప్రభవించినాడు
భగవంతుని స్మరణే భవతారకమన్నాడు అష్ట సిధ్ధి మహిమలను అవలీలగా చూసాడు
నీదంటూ ఏదీ లేదు పొమ్మన్నాడు సాయినామమొకటే తలచుకోమన్నాడు - తరించమన్నాడు
పంచభూతాలనే శాసించి చూపాడు - సంకల్ప బలముంటే అదే చాలు అన్నాడు
మనసులేని పూజలు నాకు వలదు అన్నాడు నీ మదిలోని భావాలను ఇట్టే గమనిస్తాడు
నీ గమ్యం చేరుస్తాడు
మన క్షేమం కోసమే అవతరించానన్నాడు సద్భావముంటే చాలు భవితనిస్తానన్నాడు
ఎవరిని పూజించినా - ఆది నాకు చెందునన్నాడు
అందరినీ చేరదీసి ఆదరిస్తాడు - అద్దరికి చేరుస్తానన్నాడు
నా ఆన లేకుండా నన్నెవరు తలవరనన్నాడు
సాయి - సాయి అంటే - సాయం చేస్తానన్నాడు
ఆశీర్వదించి ఆరోగ్యాన్నిస్తాడు
పూజలొద్దు ఏమొద్దు ప్రేముంటే చాలన్నాడు - అదే మీకు మేలన్నాడు
ఆత్మ చింతనే చాలు - ఆనందపు బాటన్నాడు - అరిషడ్వర్గాలను జయిన్చమన్నాడు
ప్రతిబంధకాలు అసలు ఉండవు పో అన్నాడు
నన్ను తలచువారికి నవ్యతనిస్తానన్నాడు - అదే నూతనత్వమన్నాడు
సర్వజ్ఞుడు సాయి - సమదర్శి సాయి - చేయి చాపు వానికి చేదోడు సాయి
అందరి మనసులు - అతనికి విదితము
బల్లి కథ విన్నవారి భాగ్యమే భాగ్యము - ఎంతో మహా భాగ్యము
బ్రహ్మ జ్ఞానము ఎక్కడో లేదు లేదన్నాడు
బేరసారాలకందు తావు లేదన్నాడు - మనసులోని బ్రహ్మాన్ని మేలుకొలపమన్నాడు
ఆధ్యాత్మిక చింతనమే పరబ్రహ్మమన్నాడు - పరంధాముడన్నాడు
ఉపదేశాలేమొద్డు ఉపవాసాలసలొద్దు- శ్రద్ధ సహనం ఉంటే అదే చాలునన్నాడు
శ్రద్ధ - సహనం ఉంటే అదే చాలునన్నాడు ఆదరించుతాడు ఆప్యాయత చూపుతాడు
ప్రేమకొద్దీ భక్తి కొద్దీ నీ వాడయి ఉంటాడు - నీతోనే ఉంటాడు
ఆశలు వలదన్నాడు - కర్మ చేయమన్నాడు
మోహము వలదన్నాడు - మోక్షమిస్తానన్నాడు
తృప్తి లేని జీవితం వ్యర్థం నీకన్నాడు
అది ఉంటే చాలు నీకు ఏదీ వలదన్నాడు - నేనే నీవన్నాడు
పూర్వ జన్మ కర్మ ఫలములు ఈడేరును అన్నాడు
పుణ్యమూర్తుల దర్శనాలు లభిస్తాయన్నాడు
కర్మతోటి భక్తియె నాకు కావాలన్నాడు
నా అనుమతి లేనిదే ఆది నీకు సాధ్యపడదు అన్నాడు
అందుకే వేచి ఉండమన్నాడు
స్వతన్త్రులెవరూ లేరు లేరన్నాడు అంతా నా కల్పన గాని నీదేమీ లేదన్నాడు
మంచి చెడుల తారతమ్యం నా లీలే అన్నాడు
నిను ముంచేది తేల్చేది నీ ఖర్మే అన్నాడు - నీ కర్మకొదలమన్నాడు
త్రిగుణముల భావాతీతుడు - త్రిమూర్తి స్వరూపుడతడు
సచ్చిదానంద సాయి పరమాత్ముడు - నమ్మకముంటే చాలు నడచి వస్తానన్నాడు
గురు శిష్యుల కార్ధము - నమ్మకమె అన్నాడు - అదే నమక చమకమన్నాడు
ఎవరి భక్తి వారిది - ఎవరి శక్తి వారిది - ఒకరి మీద ఒకరికి ఏమి హక్కు అన్నాడు
సేవాభావాన్ని - పెంచుకోమన్నాడు - స్నేహితుడయి జన్మ దిద్దుకోమన్నాడు - తానే దిద్డిస్తానన్నాడు
భక్తుల పాలిట తాను కల్పవృక్షమన్నాడు - సాధకుల మదిలోనే సాక్షాత్కరిస్తానన్నాడు
దుఖాల బారి నుండి రక్షిస్తాడు - జీవితాన్ని ఎంతో సుఖమయం చేస్తాడు - ఆ రుచి చూపిస్తాడు
పాప పుణ్యాలన్నీ అనుభవిన్చమన్నాడు - లోకమంతా మాయా కల్పితమే అన్నాడు
నా ఆశీస్సులే మీకు రక్ష అన్నాడు - మీ అచారములను ఎప్పడూ వదలకూడదన్నాడు
అపుడు మిమ్ము వదలనన్నాడు
సర్వాన్థర్యామి అతడు - సద్గుణాలరాసి అతడు - ఎచట చూచిన గాని అచటనే ఉంటాడు
తనవారి దగ్గరకు స్వయంగా వెళతాడు - తనవారు కనుమరుగయితే తల్లడిల్లీపోతాడు - తల్లిలా తపిస్తాడు
ఎవరికేమి ఇవ్వాలో బాబాకే విదితం ఎవరినెలా చూడాలో ఆ బాబాకే విశదం
మరణకాలమందయిన తలిచిన చాలు
పుర్వజన్మ సుకృతాన్ని జ్ఞప్తికి రప్పిస్తాడు - తనలోనే చేర్చుకుంటాడు
జీవితాలు ఎంతో అమూల్యమైనవన్నాడు - నా వారి కోశం నేనుంటానన్నాడు
యోగులందరు సమభోగులని చెప్పాడు -
సాయినాథుడే ఇల సర్వేశ్వరుడయినాడు - నమ్మిన వారిని చేయి పట్టి నడిపెను
కర్మ ఫలమీయమని తనెపుడు కోరాడు
అడిగిన వారికింకా అభయాలిస్తుంటాడు - ఏ భయమూ లేదంటాడు
సద్గురు సాయి పావనుడోయి - ద్వారకమాయి పావనమోయి
సద్గురుడు తానయి నిలిచాడట-
సాయి నాధుడై ఇల అవతరించాడు - మనలను తరియింప వచ్చాడు
పిలిచినంతనే పలికే దివ్యమైన దైవము - తలచినంతనే వచ్చి సాక్షత్కరిస్తాడు
నా స్మరణే మీకు మోక్ష మార్గమన్నాడు
నన్ను తలచు వారిని రక్షిస్తానన్నాడు
మంచినెపుడూ అందరికీ పంచమని చెప్పాడు - చెడుని చెడ్డగా తీసి తుంచివేయమన్నాడు
కాశీ, ప్రయాగ, గయలు తనకు నెలవు అన్నాడు - జన్మ జన్మల బంధాలు తెలియజెపుతుంటాడు
అసలు వలదన్నాడు - అనుభవించమన్నాడు- హీన స్థితికి ఎన్నడూ జారవద్దన్నాడు
మనస్సాక్షియే సకల వేద శాస్త్రాలన్నాడు - అపుడు సారథై సాయి నీ గమ్యం చూపిస్తాడు - నీ గమ్యం చేరుస్తాడు
నా కధార్ధాలు ఆచరణకు యోగ్యాలు - నన్ను తలచు వారికి నాశము లేదన్నాడు
నన్ను కొలుచు వారికి పరమావధి నేనన్నాడు - నా వారికి నేను పరమాత్ముడనన్నాడు
పరంధాముదన్నాడు - శిరిడీ సాయి తానే పరమేశ్వరుడనని అన్నాడు
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|