|
|
Articles: Devotion | శిరిడి దర్శిని - 3 - Mrs. seetha suri
| |
పులి బొమ్మ : బాబా చిత్రపటానికి రెండవ పక్కన పులి బొమ్మ ఉన్నది. అది కూడా బాబాకు ప్రేమ పాత్రమైనది. బాబా అజ్ఞానుసారం ఈ పులి సమాధి పాత శాంతినివాసం ఆవరణలోని మహాదేవుని ఆలయం ముందర ఏర్పాటు చేయడమైనది.
బాబా స్నానార్ధం ఏర్పాటు చేసిన చలువరాయి : ఈ రాయిని కూడా ద్వారకామాయిలో భక్తులు చూడగలరు. ప్రస్తుతం ఈ రాయి శ్యామ సుందర హాలులో భద్రపరచబడి ఉన్నది.
పల్లకి రూమ్ : ద్వారకామాయి ముఖ్య ద్వారానికి కుడి ప్రక్కన ఈ పల్లకి రూం ఉంది. ఈ పల్లకి సేవ ప్రతి గురువారం గురుస్తానం నుండి చావడి వరకు అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది.
రధం గది : రధం ఉన్న ఈ గది ద్వారకమాయి ముఖ్య ద్వారానికి ఎడమవైపున ఉన్నది.
మూడు మెట్లు : ద్వారకామాయి ముఖ్య ద్వారానికి ముందర దక్షిణం వైపున ఉన్న ఈ మూడు మెట్లు బాబాను నిత్యం చూస్తూ స్పృశిస్తూ తరించేవి. బాబా నిత్యం ఈ మూడు మెట్లను ఎక్కి మసీదులోకి పోయేవారు.
రధశాల ముందు బాబా పాదుకలు : ప్రతీరోజూ బాబా ఉదయం తప్పక ఈ రథశాల గోడను అనుకొని నిలబడి ఆకాశాన్ని చూస్తూ ఆలోచించేవారు. సూర్యరశ్మి బాగా వచ్చిన తర్వాత లెండి తోటకు వెళ్ళేవారు. దానికి గుర్తుగా అక్కడ రెండు జతల పాదుకలు భద్ర పరిచారు. అందులో చిన్న వాటిని బాబా నిలుచుని చేతులు ఆనించిన స్థానంలోను, రెండవ జత పెద్దవి బాబా నిలుచుని ఉన్న స్థానంలో క్రింద భాగంలో స్థాపించారు. పెద్ద పాదుకలు బాబా పవిత్ర చరణములని అందరూ తలుస్తారు. సంస్థానం వారు ఈ పాదుకలకు నిత్యం పూజలు జరిపిస్తారు.
ద్వారకమాయి - అందరికీ తల్లి : బాబా ద్వారకామాయిని ఒక తల్లిగా భావించి ఆఖరికి ఆ తల్లి వడిలోనే తనువు చాలించాడు.
చావడి : చావడి అంటే పది మంది కూర్చొని ముచ్చటించుకునే ప్రదేశం. శిరిడీలో చావడులు ఉన్నాయి. ఒకటి దక్షిణ ముఖంగా ఉంది. ఇంకొకటి ఉత్తర ముఖంగా ఉంది. ఉత్తర ముఖంగా ఉన్న చావడిలో ప్రస్తుతం గ్రంధాలయం ఉంది. చావడిలోని దక్షిణపు గదిలో బాబా పెద్ద చిత్రపటం ఉంది.
బాబా చిన్నఫోటోతో వెండి SIMHASANAM : ఈ ప్రదేశంలోనే బాబా రోజు మార్చి రోజు చావడిలో నిద్రించేవారు. ఈ ఫొటోనే భక్తులు రాజోపచారాలతో ప్రతి గురువారం, శ్రీ రామ నవమి, గురు పూర్ణిమ, దసరా పండుగలకు రధయాత్రలో, పల్లకి ఉత్సవంలో ఉపయోగిస్తారు.
బాబా ఇక్కడ భక్తులకక సద్బోధలు చేసేవారు.
చావడి (బాబా) ఉత్సవం : 10.12.1910 సం. నుండి భక్తులు బాబాను ఈ చావదడిలో పూజించడం మొదలుపెట్టారు. ప్రతి రోజు ఆయనని అలంకరించి తెచ్చేవారు. రాత్రి వేళల్లో ఆయనకు విడిది ఇదే. అలాగే ఇప్పటికీ ప్రతి గురువారం ఒక్కసారి ఇది జరుగుతూనే ఉంది.
చెక్క బల్ల : బాబా మహాసమాధి పొందిన అనంతరం ఆయన భౌతిక కాయాన్ని (15.10.1918) మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ మంచము మీదే ఉంచారు. అలా ఆయన దేహం దీనిపై మూడు రోజులు ఉన్నది. (అనగా 17.10,1918 వరకు.) ఈ మంచాన్ని ఇప్పుడు చావడికి మార్చారు. ప్రతి గురువారం దీనిని బయటపెట్టి బాబా పల్లకీని దీనిపై ఉంచుతారు.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|