|
|
Articles: TP Features | 'గొట్టాల' విప్లవం! - Mr. Narsing rao D
| |
అతి తక్కువ కాలంలోనే ఈటీవి 2, టివి 9 న్యూస్ చానళ్ళకు జనంలో వచ్చిన పలుకుబడి, పరపతి కారణంగా అనేక మంది దృష్టి న్యూస్ చానల్స్ వ్యాపారంపై పడింది. రియల్ ఎస్టేట్ బూమ్ కారణంగా రాత్రికి రాత్రి కోట్లకు పడగలెత్తిన వారు, ఆక్రమించుకున్న భూములను అమ్ముకుని కోట్లు సంపాదించిన వారు, కాంట్రాక్టర్లు, కమీషన్లు బొక్కిన రాజకీయ నాయకులు, బాబాలు, మతబోధకులు పెట్టుబడిదార్లు, ప్రమోటర్లుగా కొత్త అవతారం ఎత్తారు. బ్లాక్ మనీకి వైట్ వాష్ చేశారు. కొత్త కొత్త చానల్స్ మార్కెట్లోకి వచ్చేందుకు ప్రయత్నించాయి.
తమ వ్యాపారాలు, అవినీతి, అక్రమాలు, చీకటి వ్యవహారాలకు 'మీడియా' అనేది జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తుందన్న నమ్మకం బలంగా నాటుకుపోయింది. 2004 ఎన్నికల నాటికి కేవలం రెండు మాత్రమే ఉన్న వార్తా చానల్స్ సంఖ్య నేడు రమారమి రెండు డజన్లకు చేరింది. వీటిలో కొన్ని చానల్స్ ఇంకా బాలారిష్టాలను అధిగమించలేక సతమతమవుతుండగా కొన్ని మాత్రం విజయవంతంగా ప్రసారాలను ప్రారంభించేశాయి. తెలుగు జర్నలిజం చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో కేవలం నాలుగైదేళ్ళ వ్యవధిలో గొట్టాల జర్నలిజం తెలుగునాడును వాడవాడలా సునామీలా తాకేసింది. కొన్ని దశాబ్దాలుగా ఈ రంగంపై తిరుగులేని పెత్తనం చెలాయిస్తూ వస్తున్న ప్రింట్ జర్నలిస్టులు ఈ విపరిణామంతో బిత్తరపోవలసి వచ్చింది.
ప్రెస్ మీట్లు, ప్రభుత్వం కార్యక్రమాలు, ఫంక్షన్లు ఏదైనా ముందు వరుస గొట్టాల వారికే రిజర్వ్ కావడంతో పాపం తలపండిన ప్రింట్ పండితులు తమను తొక్కుకుంటూ, తోసుకుంటూ పోయే గొట్టాల బ్యాచ్ కు సాదరంగా దారి ఇవ్వడం తప్ప ఏమీ చేయలేని దుస్థితి ఏర్పడింది. గొట్టాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ప్రింట్ జర్నలిస్టులు చివరి వరసలో చేరడం వినా మార్గాంతరం లేకపోయింది. గొట్టాలకు ఉన్న ఈ పవర్ ను చూసి ప్రింట్ జర్నలిస్టులు సైతం గొట్టం పట్టుకోవడానికి ఎగబడటం ప్రారంభమైంది.
వృత్తిరీత్యా అనేక సంవత్సరాలపాటు శిక్షణ పొందిన ప్రింట్ జర్నలిస్టులు ఏకబిగిన పది పదాలు తెలుగులో మాట్లాడటం రాని జర్నలిస్టుల హవా ముందు వెలవెలపోవలసి వచ్చింది. బకతలేక బడి పంతులు అన్నట్లుగా అప్పటి వరకు వచ్చీ రాని జీతాలతోను, చాలీ చాలని బతుకులు ఈడుస్తున్న ప్రింట్ జర్నలిస్టులకు 'గొట్టం' ఒక అద్భుతమైన అవకాశంగా కనిపించడంతో అనేకమంది రెక్కలు కొట్టుకుంటూ గొట్టాల కంపెనీలపై వాలిపోయారు. ఇక ప్రింట్ జర్నలిజంలో ఏళ్ళ తరబడి పనిచేయడం వలన సంభవించే మానసిక రుగ్మతుల కారణంగా వృత్తికి, సమాజానికి దూరమైన అనేక మంది తలనెరిసిన సూడో మేధావులకు సైతం 'గొట్టం' పునరావాస కేంద్రంగా మారింది. ప్రసవాల నుంచి మరణాల వరకు ఏ అంశంపై చర్చా గోష్టి జరిగినా అందులో దర్శనమిచ్చేంది ఈ నిలయ విద్వాంసులు, ఆస్థాన పండితులే.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|