|
|
Articles: TP Features | ప్రమాదం అంచున ప్రవాసాంధ్రం - Dr. Ramesh Babu Samala
| |
అయితే, భాషా రాష్ట్రాల్లో ఇతర భాషల్ని మాతృభాషగా కలిగినవారి కోసం ఏర్పరచిన ఈ సౌకర్యాన్ని ఆచరణలో సఫలం చేయడానికి కృషి జరగడం లేదు. తమిళనాడు, కర్ణాటక రెండు రాష్ట్రాల్లో దాదాపు ఐదు కోట్ల మంది తెలుగువారు ఉన్నారు. ఆ రాష్ట్రాల్లో తెలుగు భాషీయులు తమ తల్లి భాషను రక్షించుకోవడానికి రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొని 'యునెస్కో' పిలుపునందుకొని ఎంతో కృషిచేయవలసి ఉంటుంది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవమైన ఈ రోజునే 2003లో తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆవిర్భవించిన మన రాష్ట్రంలోనూ, పొరుగు రాష్ట్రాల్లోనూ, తెలుగు భాషా పరిరక్షణకూ వికాసానికి ఎంతో కృషి చేస్తోంది. పొరుగు రాష్ట్రాల్లోని ఉన్న తెలుగు బడులలో నెలకొన్న దయనీయమైన పరిస్థితుల్ని నివారించడానికి సంయుక్త సభాసంఘాన్ని శాశ్వత స్థాయిలో నియమించాలని తెలుగు భాషోద్యమ సమాఖ్య, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం కోరగా కోరగా మన రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆరునెలల ఆయుష్షుతో ఒక సభా సంఘాన్ని నియమించింది. దాని కాలం ఈ నెలతో చెల్లిపోతుంది. ఒకసారి పర్యటించి నివేదికను సమర్పించి చేతులు దులుపుకోవడంతో ఆ సభాసంఘం పని తీరిపోయింది. శాస్వత సభాసంఘాన్ని నియమించడంతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.
ఇదొక్క అంశమే కాదు, మన రాష్ట్రం ఏర్పడిన ఉద్దేశ్యాన్నే మన ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. అర్ధశతాబ్ది దాటినా రాష్ట్రంలో ప్రజల భాషల్లో పరిపాలించాలని ఈ ప్రభుత్వాలు అనుకోవడం లేదు. పిల్లలకు పాఠశాల చదువును కనీసం ప్రాథమిక విద్యను తల్లి భాషలో బోధించాలనే ఇంగిత జ్ఞానాన్ని మన ప్రభుత్వ నేతలు కోల్పోయారు. మన రాష్ట్రంలో తెలుగును కాపాడి, వికసింపచేయడం కోసం గాని, అసలు తెలుగుకు సంబంధించిన ఏ అంశం గురించి మన ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా అదంతా చెవిటికి శంఖూదినట్లే అవుతుంది. కారణం - పొరుగు రాష్ట్రాల్లో వారి భాషల కోసం ఉన్నట్లుగా - తెలుగు కోసం ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడమే. ఏ మాత్రమూ అధికారంలేని నామమాత్రావశిష్టంగా ఉన్న అధికార భాషా సంఘాన్ని అధికారులు ఎవరూ ఖాతరు చేయడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రికీ, మంత్రివర్గ సభ్యులకూ తక్కిన రాజకీయ పార్టీలకూ ఎవరికీ తెలుగు పట్ల పట్టుదల లేకపోవడమే కారణం. రాజ్యాన్ని భోగ వస్తువుగా వీళ్లు భావిస్తున్నారేమో! ప్రజల భాషను నొక్కివేయడం ద్వారా ఒక జాతి శక్తిని అణచివేస్తున్నారని వీళ్లు తెలుసుకోవడం లేదు.
ఈ స్పృహను మన రాజకీయ పార్టీల్లో తేవడానికీ, మన ప్రభుత్వాలకు ప్రజల భాషపట్ల శ్రద్ధ, బాధ్యత కలిగించడానికీ తెలుగు భాషోద్యమ సమాఖ్య ఉద్యమాలు చేపడుతున్నది. భాషను కూడా ఒక రాజకీయ అవసరంగా మన పార్టీలు భావించే స్థితిని నిర్మాణం చేసే దిశగా ఈ ఉద్యమాల్ని నడుపవలసి ఉంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|