|
|
Articles: Devotion | మహా శివరాత్రి మహత్యం - Site Administrator
| |
ఈ బ్రహ్రండం అంటే సృష్టి ప్రారంభంలో అహోరాత్రులు అంటే పగలు-రాత్రి అని కాలవిభజన లేదు. సంధ్యా సమయాలు త్రి సంధ్యలు లేవు. అంతా, నిరంతరం కాల నియమం లేక ప్రకృతి ఒకే విధంగా ఉండేది. అది ప్రళయకాలం. గ్రహాలు, ప్రాణికోటి అంతర్హితమయ్యాయి. అంటే నశించాయి. సూర్యచంద్రులు కూడా అంతర్ధానం కావడంతో నిబిడాంధకారం ఆవరించింది. దిక్కులు లేవు. దాంతో దిశా నిర్దేశం కరువైంది. ఆ గాఢాంధకారంలో జగన్మాత కాత్యాయనీ దేవి సమస్త సృష్టికారకాలనూ తన చేతిలో ఉన్న మహాపద్మంలోకి రప్పించి భద్రపరిచి ప్రళయాంతంవరకూ కాపాడింది.
శివనామం జపిస్తూ భక్తి తత్పరతతో తపస్సు చేయసాగింది. కొంతకాలం గడిచింది. ప్రళయాంతం జరిగింది. అయినా కారు చీకట్లు తొలగిపోలేదు. ఆ సమయంలో చీకట్లను చీల్చుకుంటూ త్రినేత్రుడు ప్రత్యక్షమయ్యాడు. శివనామాన్ని జపిస్తూ తపస్సు చేయడానికి కారణమేమిటని అడిగాడు ఫాలాక్షుడు. అప్పుడు కాత్యాయని 'సాంబశివా! నువ్వు ఈ నిబిడాంధకారాన్ని పారద్రోలి నీ రాకతో సమస్త సృష్టిని ప్రకాశమానం చేశావు. ప్రళయాంతాన ఉద్భవించిన కారుచీకట్ల బీభత్సాన్ని తొలగించావు. ఈ పవిత్ర పుణ్యకాలం లోకంలో కాలవిభజన జరిగాక పలుమార్లు వస్తుంది. మాఘ మాసం బహుళ చతుర్దశిగా అప్పుడు ఈ కాలాన్ని పిలుస్తారు. నీవు ప్రత్యక్షమైన ఈ కాలాన్ని 'మహా శివరాత్రి'గా ప్రాచుర్యం పొందేలా చేయి. ఈ రోజు నాలుగు జాములా ఎవరు నిన్నే స్మరించి, భజిస్తారో వారికి ఇష్ట సంకల్పసిద్ధి కలిగేలా, కామితార్ధం ఈడేరేలా, సకల మనోరధ వాంఛితాలు ఫలించేలా అనుగ్రహించు' అని కోరింది.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|