|
|
Articles: Devotion | అవదూత చర్య - Editor
| |
ఒకప్పుడు ఒక శ్రీమంతుడు ఖరీదైన దుప్పటి ఒకటి బలవంతంగా స్వామి చెంతన వుంచి వెళ్ళిపోయాడు. దానిని సేవకులు తీసుకున్నారు. స్వామి దానిని ఎరగనట్లు అయ్యా ఒక కొత్త దుప్పటి కావాలి అని స్వీకరించి, దానిని జానెడు పీలికలుగా చింపియిచ్చి, ఇవి ఇస్తే జబ్బుల వాళ్ళకు జబ్బులుపోతాయి అన్నారు. మరొక్కప్పుడు ఒక చినిగిపోయిన పాతబ్యాగ్ ను స్వామి చెంతవుంచి వెళ్ళాక అర్థరాత్రి అందరూ నిద్రలో వుండగా స్వామి దానిని ధునిలో వేసి కాల్చివేసారు. ధనికులొచ్చి ధనం కుమ్మరించినంత మాత్రాన వారికి ప్రశ్నలు చెప్పేవారు కాదు. పైవాళ్ళు ఒప్పుకోలేదనిగానీ, మాటరాలేదనిగానీ చెప్పి పంపేసేవారు. భక్తిశ్రద్ధలు గలవారికి వారు అడగకుండానే తమ ఆశీస్సుల చీటీ వ్రాయించి యిచ్చేవారు. కోరికలు తీరిన భక్తులు సంతర్పణ చేసిన పండుగనాడు కూడా వారు మాత్రం భిక్షాన్నం మాత్రమే తినేవారు. అయ్యా! వారు పెట్టారు కదా అని మనం భిక్షకుపోకుంటే రేపు మళ్ళీ వెళ్ళినా పెట్టరయ్యా! అనేవారు. ఇలా స్వామిని సన్నిహితంగా సేవించిన వారి దివ్యానుభవాలు ఎన్నో.
(ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ వారి 'నేను దర్శించిన మహాత్ములు' నుంచి)
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|