|
|
Articles: TP Features | శ్రీలంక తెలుగువారి తపన - Mr. Ramesh Sa.Ven.
| |
నిజానికి నేను లంకకు పోలేదు. నా కోసం ఈ పని చేసి, రెండు గంటలకు పైగా కదిలే బొమ్మలను నా కళ్ల ముందుంచి నన్ను లంకలోని అహికుంటికల పల్లెకు తీసుకొనిపోయింది నా మిత్రుడు అడపాల సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి పరిచయం ఈ నడుమనే అయింది. నా ప్రళయకావేరి కథలను ఇష్టపడి, నన్ను పరిచయం చేసుకొన్నాడు సుబ్బారెడ్డి.
కొలంబో నుంచి సుమారు 120 కిలో మీటర్ల దూరంలోని చెరువంచునున్న 'దేవరగమ్మ'కు పోయే ముందు మా సుబ్బారెడ్డిని గురించి కూడా నాలుగు మాటలు చెప్పనీయండి.
సుబ్బారెడ్డిది నెల్లూరు జిల్లాలోని మహమ్మదాపురం అనే పల్లె. చిన్నప్పుడు కోరుకొండ సైనిక పాఠశాలలో, పెద్దయినాక ఎం.బి.ఎ చెన్నపట్నంలో చదివినాడు. కొంచెం సినిమా పిచ్చోడు. కొంచెం అన్నమాట తప్పేమో. చూడడం వరకూ ఫరవాలేదు గానీ అక్కడితో ఆగలేదు. దర్శకుడు అయితే బాగుంటుందనుకొన్నాడు. తట్టాబుట్టా సరుదుకొని భాగ్యనగరం చేరుకొన్నాడు. కాస్త విలువలున్నవాడు. సినిమాలలోనూ అంతో ఇంతో విలువలు ఉండాలనుకొనేవాడు. తనకు తగ్గవాడి కోసం వెతుకులాడడం మొదలుబెట్టినాడు. ఆ వెతుకులాటలో నగేశ్ కుకునూరు తగిలినాడు. కుకునూరు మన తెలుగువాడే. కానీ అన్నీ హిందీలోనే తీస్తుంటాడు. పోనీండి, మన తెలుగువాళ్ల గొప్పదనాన్ని ఉత్తరాదివాళ్లకు రుచి చూపించిన ఆ కాలపు శాంతారాం ఉన్నారు కదా, అట్లాగే ఇప్పటి నగేశ్ కూడా. కుకునూరు జట్టులో సుబ్బారెడ్డి కూడా ఒక కీలకమైనవాడు.
ఒకనాడు 'డోర్' అనే సినిమాను చూడమని కేసెట్టు ఒకటి పంపినాడు. సినిమా గొప్పగా ఉంది. ఆ సినిమా గురించి నేను చెప్పబోవడం లేదు. అందులో 'బహురూపి' పాత్ర ఒకటుంది. బహురూపి అనేది ఒక సంచార కులం. డోర్ చూసినప్పటికి కొద్దిగా ముందు కర్నాటకలో బహురూపల గురించి విని ఉన్నాను. వేమన సర్వజ్ఞ సంవాదమనే పాటను కర్నాటకలోని బుడగజంగాలు పాడేవాళ్లు. ఆ పాట కోసం వెతుకుతూ రాయచూరు జిల్లాలోని కౌతాళం అనే ఊరికి పోవాలసొచ్చింది. (కౌతాళాలు మూడున్నాయి. ఇప్పటి ఆంధ్ర రాష్ట్రపు కర్నూలు జిల్లాలో ఒకటి, ఇప్పటి కర్నాటకలోని రాయచూరు జిల్లాలో ఇంకొకటి, ఇప్పటి తమిళనాటి కృష్ణగిరి జిల్లాలో మరొకటి. మూడు కౌతాళాల్లోనూ తెలుగువారే ఉంటారు. ఎప్పుడూ చెప్పేదే, కర్నాటక తమిళనాడులు నిన్న మొన్నటివే కదా) అక్కడి బుడగజంగాలు చెప్పిందేమిటంటే, వాళ్ళు రాజస్థానం నుంచి కన్యాకుమారి వరకూ పరుచుకొని ఉన్నారట. అంటే ఎడారి నుంచి కడ కడలి అంచు వరకూ. ఉత్తరాదిన వీళ్లనే బయిరూపి, బహురూపి అంటారుట. ఎక్కడున్నా ఇంట తెలుగును వదలలేదట.
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|