|
|
Articles: My Thoughts | చానెళ్ళ చాకిరేవు - Editor
| |
ఇక అసలు విషయానికి వస్తే న్యూస్ చానెళ్ళ హడావుడి అంతా ఇంతా కాదు. ప్రస్తుతానికి చిన్నతెరపై వార్తా ప్రసారాల చానెళ్ళుగా టీవీ 9, ఈటీవీ 2, ఎన్ టీవీ, టీవీ 5, జెమినీ న్యూస్, కొత్తగా ఐ న్యూస్, హెచ్ ఎం టీవి జనాల మతులు పోగొడుతున్నాయి. సాక్షి న్యూస్ చానెల్ కూడా కొద్ది రోజుల క్రితం లాంఛనంగా ప్రారంభమైంది. అయితే మార్చి ఒకటవ తేదీ నుంచి ఈ చానెల ప్రసారాలు కూడా ప్రజల మీదకు విచ్చలవిడిగా రాబోతున్నాయి.
రానున్న రెండు నెలల్లో ఈ క్రింది చానెళ్ళు కూడా ప్రేక్షకులపై యుద్ధం ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నాయని సమాచారం. అవి మా న్యూస్, జెడ్ న్యూస్, విస్సా న్యూస్, మహా న్యూస్, టి న్యూస్, సితార న్యూస్, స్టూడియో ఎన్, ఏటీవీ, స్టార్ తెలుగు, మీడియా టీవి, ఆంధ్రా టీవి, 25 ఫ్రేమ్స్, సితార ప్లస్, ప్రతాప్, ఇందిరా టీవీ, మా భక్తి, ఈటీవి భక్తి, ధర్మ టీవి, శ్రీగిరి టీవి, యూటీవి, మహిళా మణి, ఖుషీ టీవి వస్తున్నాయట. వీటితో పాటు మనకు లోకల్ చానెల్ హడావుడి సరేసరి. సిటీ కేబుల్ వాళ్ళు కూడా ఐదారు చానెళ్ళలో అన్ని రకాల కార్యక్రమాలు కవర్ చేసేస్తున్నారు. దీంతో ప్రేక్షకులు ఏ చానెల్ లో ఏముందు తాము చూసింది ఏ చానెల గుర్తుంచుకోలేక హైరానా పడిపోతున్నారు. ఇంతవరకూ ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకు వచ్చిన చానెళ్ళు ఇప్పుడు బావురుమంటుండడం కొసమెరుపు!
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|