|
|
Articles: TP Features | మహా సరస్సు మాయం - Editor
| |
వానాకాలం నది వరదలలో ఉన్నంతకాలం అంటే ఆగస్టు నెల వరకు ఆ చిన్న గండి దగ్గర నది పాపికొండలను ఒరుసుకోవడం వల్ల అక్కడ నీరు గుండ్రంగా సుడి తిరుగుతుంది. నేర్పరి అయిన నావికుడు మాత్రమే తన నౌకను ఆ సుడిలో చిక్కుబడకుండా తప్పించుకొని ముందుకు తీసుకుపోగలడు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఆ సుడి నావను తన లోనికి లాక్కొని ముంచేస్తుంది. ఆ సుడి ముందు మరపడవలు కూడా నిలువలేవు.
పాపికొండలకు ఆ పేరు ఎలా వచ్చింది? :
ప్రతి సంవత్సరం ఎన్నో పడవలు నైపుణ్యంలేని నావికుల వల్ల, కొందరు నావికుల అజాగ్రత్త వల్ల, మరికొందరి అతి జాగ్రత్త వల్ల, పడవలో ప్రయాణించే, ప్రయాణికుల తెలివి తక్కువతనం వల్ల పడవలు ఆ సుడిలో చిక్కుకుని పడవలోని ప్రయాణికులు ప్రాణభయంతో చేసే ఆర్తనాదాలతో ఆ పాపి కొండలు మార్మోగేవి. అలా మునిగిపోయిన అభాగ్యుల బంధువులు ఆ కొండలను చూచినపుడు ఈ 'పాపపు కొండల' గండే మావాళ్లను పొట్టన పెట్టుకున్నదని 'శాపనార్థాలు' పెట్టేవారు. ఆ పాపపు కొండలే పాపికొండలయ్యాయి! పెద్ద పెద్ద మర పడవలు వచ్చాక పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది.
పాపికొండలే ఒకనాటి సరస్సుకు మూలం :
పాపికొండల గండి నడుమ గోదారిలో నిలిచినపుడు గుండె గుభిల్లుమనిపించే ఈ గండి ఏర్పడకుంటే, 'గోదావరి' స్థితి ఎలా ఉంటుంది, దాని గమనమెటు? అనే ఆలోచన నాకే గాదు, ప్రతి ఒక్కరికీ వస్తుంది. వచ్చి తీరుతుంది. నిజమే.ఒకానొక కాలంలో ఈ పర్వతం ఏక ఖండంగానే ఉండి 'గోదావరి'ని నిలువరించి, వెనక్కు నెట్టిన ఫలితంగా ప్రాకృతిక పరమైన మహా సరస్సు ఏర్పడింది.
ఈ నది ఖమ్మం జిల్లాలోనికి వాయవ్య దిశ నుండి ప్రవేశిస్తుంది. ఉత్తరాన కొండలు పాపికొండల దాకా విస్తరించి ఉన్నాయి. పడమట 'మణుగూరు', 'ఇల్లందు', 'సింగభూపాలం' కొండలు విస్తరించి ఉన్నాయి. ఈ కొండల నడుమ ఉన్న విశాల భూభాగం పల్లపునేల. ఇంత మేరకు సరస్సు ఏర్పడింది. ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమంతా ఆనాటి సరస్సులో మునిగి ఉండేది. ఈ సరస్సు గోదావరి నీటితో నిండి పోటెత్తిన నీరు, సరస్సు నిండగా అదనంగా వచ్చిన నీరు మత్తడి గుండా దిగువకు ప్రవహించినట్లుగా కిందకు ప్రవహించసాగింది. దక్షిణాన ఉన్న కనిగిరి కొండలు ఎర్రగుంట వరకు వచ్చి ఆగిపోతాయి. అక్కడి నుండి 'అశ్వారావుపేట' దిగువ వరకు ఆ సరస్సు నుండి వచ్చే నీటిని ఆపగలిగిన కొండల వరుసలు లేవు. అందువల్ల ఈ ఆగ్నేయ దిక్కు నుండి మిగులు జలాలు కిందకు పారేవి. ఈ సరస్సుకు వంగముత్యాలు బంజర దగ్గరలో ఉన్న ఎడ్లబంజరు, లంకపల్లి, సత్తుపల్లి నుండి అశ్వారావుపేట వరకు ఆగ్నేయ సరిహద్దు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|