|
|
Articles: TP Features | స్విస్ ఖాతాల గుట్టు రట్టు - Mr. Narsing rao D
| |
19 వేల స్విస్ బ్యాంక్ అమెరికా ఖాతాదారుల్లో అగ్రభాగాన ఉన్న 250 మంది అకౌంట్ల వివరాలను అమెరికా అధికారులకు యుబిఎస్ తెలియజేయాల్సి ఉంటుంది. అమెరికా ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ను మోసం చేసినందుకు గాను యుబిఎస్ 780 మిలియన్ డాలర్ల అపరాధ రుసుమును చెల్లిస్తోంది. యుబిఎస్ ఆఫ్ షోర్ అకౌంట్లలో 19 వేల మంది అమెరికన్లు 18 బిలియన్ డాలర్ల డబ్బు దాచుకున్నట్లు ఆ బ్యాంక్ ఆరోపణలను ఎదుర్కొంటోంది. అయితే ప్రస్తుతం, 52 వేల అమెరికన్ రహస్య అకౌంట్ల గురించి వెల్లడించాలని యుబిఎస్ ను అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ ఒత్తిడి చేస్తోంది.
కరెన్సీ నిబంధనలను అతిక్రమించడం, పన్నుల ఎగవేతలను స్విస్ చట్టాలు నేరాలుగా పరిగణించని పక్షంలో ఆఫ్ షోర్ అకౌంట్ల గురించి వెల్లడించేది లేదని స్విస్ బ్యాంక్ అధికారులు తెలిపారు. బోఫోర్స్ కేసు విషయంలో కూడా ఇలాగే జరిగింది. ప్రస్తుతం స్విస్ అథారిటీలతో అమెరికా చేసుకున్న ఒప్పందం అలాంటి అడ్డుగోడల్ని తొలగించింది. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్ కు తెలియకుండా ఉండే అమెరికన్ ఖాతాదారుల ఆఫ్ షోర్ అకౌంట్లన్నిటిని తాను వెల్లడిస్తున్నానని యుబిఎస్ ప్రకటించింది. ఈ చర్చలన్నిటిలోనూ వాణిజ్య - వ్యాపార దిగ్గజాలు, రాజకీయ ప్రముఖులు, ఉన్నత సైనికాధికారులు, ప్రఖ్యాత కళాకారులు తదితర భారతీయ ప్రముఖులు గత ఐదారు దశాబ్దాలుగా విదేశీ బ్యాంకుల్లో రహస్యంగా నిర్వహిస్తున్న ఖాతాల విషయంపై ఒకసారి దృష్టి సారించాలి.
లిక్టన్ స్టెయిన్ దేశం సంపన్నులకు ఆపన్నహస్తం అందించే ఒక సౌకర్యవంతమైన 'లెటర్ బాక్స్'గా ప్రసిద్ధి చెందింది. ఈ దేశంలో ప్రపంచ సంపన్నులు తమ పన్ను ఎగవేత డబ్బును చాలా రహస్యంగా దాచుకునేందుకు వీలుంటుంది. తమ దేశంలో రహస్యంగా దాచుకున్న డబ్బుపై ఆరా తీస్తున్న జర్మనీపై లిక్టన్ స్టెయిన్ దేశ యువరాజు అలోయిస్ వాన్ ఉండ్ జు తీవ్రంగా మండిపడ్డారు. పన్ను ఎగవేత దారులు ఆ దేశంలో రహస్యంగా దాచుకోవడాన్ని జర్మనీ నిరోధించేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. ఆ దేశపు యువరాజు నడుపుతున్న ఎల్టిజి బ్యాంకులో పన్నులు ఎగ్గొట్టి దాచుకున్న ఖాతాదారుల రహస్య వివరాల కోసం జర్మనీ ఏజెంట్లు ఒక ఇన్ ఫార్మర్ కు 6 మిలియన్ల అమెరికన్ డాలర్లను చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ వివాదం ప్రపంచంలోని ప్రముఖ లాజిస్టిక్ సంస్థగా పేరున్న జర్మనీ మెయిల్ సర్వీస్ డ్యూయిష్ పోస్ట్ అధినేత రాజీనామాకు దారితీసింది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|