TeluguPeople
  are the trend-setters

 
Articles: TP Features
మన భాష...భవిష్యత్తు
- Dr. Ramesh Babu Samala
< < Previous   Page: 2 of 3   Next > >  
సరే మళ్లీ కొంచెం వెనక్కు వెళదాం. భాషాప్రయుక్త రాష్ట్రాల కోసం స్వాతంత్ర్యోద్యమ సమయంలోనే కోరికలు బయటపడ్డాయి. అయితే ఆ విధంగా పోరాడిన ఘనతను గురించి తెలుగువారు చెప్పుకొన్నా, దాని చీకటి వెలుగుల విశ్లేషణలోకి వెళ్తే కఠిన రాజకీయ వాస్తవాలు బయటబడతాయి. ఆనాటి కోస్తా, రాయలసీమ ప్రాంతాల నాయకులు మద్రాసు రాష్ట్రం నుండి తమ ప్రాంతాలను బయటకు తెచ్చుకోవాలని నడిపింది అచ్చంగా రాజకీయ ఉద్యమం. అయితే, మూడు సముద్రాల మధ్య అంతా విస్తరించివున్న తమ తోటి తెలుగువారి గురించి వారసలు ఆలోచించనేలేదు. ఉద్యమాలు నడిపి, పొట్టి శ్రీరాములు గారి బలిదానపు ఆలంబనంతో తాము కోరుకున్న అధికారాన్ని సాధించుకొన్నారు. అదే విధంగా నిజాంనుంచి విముక్తిని సాధించుకొన్న తర్వాత - విశాలాంధ్ర నినాదంతో జరిగిన ఉద్యమాలను ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ ను సాధించుకొన్నారు. ఈ క్రమంలో ఎన్నో తెలుగు ప్రాంతాలను వదులుకొన్నారు. అర్థశతాబ్దం తర్వాత మన పరిస్థితిని - భాషా సాంస్కృతికపరంగా - చూసుకొంటే భయంకరంగా ఉంది. ఏ భాష పేరుతో ఈ విశాలరాష్ట్రాన్ని సాధించుకొన్నామో, ఆ తెలుగు భాషే అస్తిత్వ సంక్షోభంలోకి జారిపోయింది. తెలుగుజాతి మేధో వికాసానికి పెద్ద గండిపడింది. పర్యవసానంగా తల్లి భాష తెలుగుతో సహా, ఏ భాషలోనూ సలక్షణంగా నాలుగు వాక్యాలు రాయలేని నూతనతరం ఆవిర్భవించింది. ప్రభుత్వాల అండతో ఇంగ్లీష్ భాష ప్రాతిపదికన తెలుగు భాషా జాతీయుల్ని కలవారి, లేనివారి బిడ్డలుగా వేరు చేసే కార్పొరేట్ విద్యావిధానం ఇందుకు కారణం. ప్రపంచ వాణిజ్య అవసరాలకు అనుగుణంగా దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలను వంగదీసే క్రమంలో, ప్రభుత్వాలకు సరియైన విద్యావిధానం, భాషా విధానం లేకపోవడం వల్ల, తెలుగుజాతి తీవ్రంగా నష్టపోతున్నది. మనుషుల్లో కాకుండా వస్తువుల్లో మాత్రమే అభివృద్ధిని చూసే పాశ్చాత్య దృక్పథం ప్రబలం కావడం వల్ల, జాతి శ్రేయస్సుకు అంకితమైన నాయకత్వ లేమి వల్ల జాతిహితం తిరగబడింది. రాజకీయ దురుద్దేశ్యాల వల్ల కొన్ని భాషలకే ప్రోత్సాహం లభించడం, అభివృద్ధి పేరుతో సాగే పర్యావరణ విధ్వంసం కారణంగా అద్భుతమైన సహజ భాషా సంపదలు అభివృద్ధి పేరుతో సాగే పర్యావరణ విధ్వంసం కారణంగా అద్భుతమైన సహజ భాషా సంపదలు అంతరించిపోతున్నాయి. భాష అంతరిస్తే భాషా జాతీయుల అస్తిత్వం అంతరిస్తుంది. ఆ విధంగా జాతిక్రమంగా అంతర్థానమైపోతుంది. ఇదే సమయంలో రాష్ట్రం బయటి దేశంలో - తెలుగు భాషీయులు ఎక్కువగానే, రెండవ స్థానంలోనో ఉన్న ప్రాంతాలను చిత్రపటంలో చూడండి. మరి వారి పరిస్థితి ఏమిటి? భాషా రాష్ట్రాల బూటకపు విభజన వల్ల దగాపడిన ఈ తోబుట్టువులనేం చేద్దాం? ఆ రాష్ట్రాల్లో భాషా రాజకీయాల తీవ్రత మనకు తెలుసు. ఆ రాజకీయ తోడేళ్లకు ఇప్పటికే మనవాళ్లు భాషా సాంస్కృతికపరంగా ఎంతో బలైపోయారు. నిజానికి ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం ఇక్కడ ఉద్యమాలు జరిగే సమయంలోనే అక్కడి ప్రాంతాల్లో తెలుగు వాళ్ళెక్కువ ఉండి, తమిళమో, కన్నడమో, ఒరియానో రెండవస్థానంలో ఉన్నచోట తెలుగువారికి వ్యతిరేకంగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యమాలు వచ్చాయి. సరిహద్దు ప్రాంతాల్లో అవి ఎక్కువ జరగడంతో ఏర్పడిన అభద్రతా వాతావరణం ఎన్నో సామాజిక దుష్పరిణామాలకు దారి తీసింది. సామూహికంగా కులాలవారీగా భాషాంతరీకరణ చెందడం జరిగింది. లేదా - స్వంతభాషను ఇంటివరకే పరిమితం చేసుకోవడంతో ఎదుగూ బొదుగూ లేక భాష, దానితోపాటు వారి వ్యక్తిత్వం, అస్తిత్వం బలహీనపడ్డాయి. భాషలో కోల్పోవడం ద్వారా వారి మానవ హక్కుల్ని కోల్పోయారు. అయినా ఏదో ఒక సందర్భంలో వారు తమ తమ మూలాలను గురించి ఆలోచించుకోక తప్పదు కదా!

Read 1 Comment(s) posted so far on this Article!

< < Previous   Page: 2 of 3   Next > >  



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.