|
|
Articles: Devotion | మహాత్ముల ప్రేమ అనంతం - Editor
| |
ఇంట్లోని వారు తరువాత భిక్ష ఇస్తామనినా కూడా ఆయన వినిపించుకోలేదు.
అప్పుడు పాటిల్ భాయి భార్యకు గతంలో బాబా, తన భర్తతో అన్న మాటలు గుర్తుకు వచ్చాయి.
ఆమె వెంటనే అతడికి నమస్కారం చేసి భోజనం పెట్టింది. తరువాత అతడు దక్షిణ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు.
పాటిల్ భాయి శిరిడీ వచ్చినప్పుడు బాబ అతిడికి ఆ వృత్తాంతం చెప్పి, 'నువ్వు పిలవకున్నా నాకు భిక్ష, దక్షిణ ముట్టాయి' అన్నారు.
శ్రీ వెంకయ్యస్వామి వారి సేకులలో ఒకరైన దశయ్య పెనవర్తిలో మిద్దె ఇల్లు కట్టసాగాడు.
అందుకు స్వామికి చెప్పకుండానే శంఖుస్థాపన చేసి, పునాదులు త్రవ్వించి పని మొదలు పెట్టించాడు.
అయితే స్వామి మాత్రం తమ కృపను, అనుగ్రహాన్నీ అందిస్తూనే ఉన్నారు.
ఒక రోజు మధ్యహ్నం పూట స్వామివారు ఒంటరిగా వచ్చి, ఆ పునాదులలోకి దుమికి అన్నివైపులా తిరుగుతున్నారు. ఇంటికి మధ్యలో ఉన్న పునాదులలో పెట్టి, 'అంతే... అంతే... అంతా సరిపోయింది' అని మరేమీ మాట్లాడకుండా ఎక్కలేక ఎక్కలేక పైకి వచ్చి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయారు.
కాలక్రమంలో ఇల్లు త్వరగా పూర్తవడమే కాక, అతడు లక్షాధికారి కూడా అయ్యాడు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|