|
|
Articles: Devotion | పంచగురుధామం - Mrs. seetha suri
| |
సద్గురు సాయి ఆనతి ననుసరించి (30.7.2007) అనగా సోమవారము ఆషాడ పౌర్ణమి అనగా గురు పౌర్ణమి నాడు బాబా గారి మూర్తిని ఈ కూర్మ పీఠమున ప్రతిష్ఠించి స్థానికుల సహాయ సహకారములతో అత్యంత భక్తి శ్రధ్ధలతో పూజాభిషేక కార్యక్రమములు ఘనముగా నిర్వహించుట జరిగినది. అంతియె కాక బాబా మందిర నిర్మాణమునకు అంకురార్పణ జరిగినది. బాబా గారి సంకల్ప బలముతో (6.3.2008) అనగా మాఘ మాసములొ శివరాత్రి నాడు బాబా గారి సన్నిధిన శివలింగ ప్రతిస్థాపన జరిగినది. (14.4.2008) అనగా శ్రీరామ నవమి నాడు శ్రీ సీత రామ కల్యాణము జరిపి వారి విగ్రహములు ప్రతిష్ఠించుట జరిగినది. బాబా ఈ స్థలమును పంచ గురుస్తానముగ చూడనొపినారు. అత్యంత స్వల్ప కాలములొనే బాబా గారి మందిరముతో పాటు ధ్యానమందిరము, అందులో దత్తాత్రేయ విగ్రహముతొ సహా శ్రీపాదులు , నృసింహ సరస్వతి శ్రీ స్వామి సమర్ధ శ్రీ గజానన్ మహారాజుల విగ్రహములను పాడేరు (విశాఖపట్నం జిల్లా) వాస్తవ్యులైన శ్రీ కీర్తి దయానిధి స్వామివారి కరకమలములతో (18.7.2008) అనగా ఆషాడ గురు ఫౌర్ణమి నాడు ప్రతిష్ఠింపబడినవి. అదే విధముగా సాయి బాబా ఆదేశానుసారము ప్రపంచములో ఎక్కడా కనీ వినీ ఎరుగని విధముగా రామకోటి స్థంభము అందు పాతళమున 36 కోట్ల రామ నామ లిఖిత గ్రంధములు నిక్షిప్తము చేయబడినవి. ఆ స్తంభమునకు నాలుగు దిక్కులా నాగబంధ శిలా ప్రతిమలు క్షేత్ర పాలకునిగ స్తూపముపై ఆంజనేయ స్వామి విగ్రహము ప్రతిష్ఠింపబడినది.
సకల ఐశ్వర్య ప్రదమైన బాబా గారి ధుని (13.11.2008) అనగా కార్తీక పౌర్ణమి నాడు బాబా ఆజ్ఞానుసారము లక్ష రుద్రాక్షలతో యజ్ఞము చేసి ఏర్పాటు చేయబడినది. ఆ పిమ్మట (22.2.2009) మహా శివరాత్రి నాడు బాబా గారి ఆశీశ్శులతో మరియు ఆనతితో బాబా మందిర ప్రాంగణమునందు యగ్న వాటికలను నిర్మించి ఋత్విక్కులను ఆహ్వానించి శ్రీ కొండూరి కామేశ్వర రావు గారు మరియూ శ్రీ జి. వెంకటరావు గార్ల ఆధ్వర్యములో అశ్వమేధయాగము జరపబడినది. అందుకు గుర్తుగా స్వామి వారి ఆలయ ప్రాంగణమున మహిమాన్వితమైన అశ్వమేధయాగ స్తూపము నిర్మించపడినది. ఆ దినమున యజ్ఞముతో పాటు శివునికి అభిషేకములు లింగోద్భవకాలమున మహన్యాస రుద్రాభిషేకములు మరియూ సాయి సచ్చరిత్ర పారయణము నిరాఘాటముగ జరిగినది. ఈ వేడుకలు చూచుటకు వివిధ ప్రాంతములనుండి అచ్చటి స్థానికులతోపాటు సందర్శకులు వచ్చి యుండిరి. ఇచ్చట ప్రతి గురువారము అన్నదానము సింధొన్ గ్రామ నివసి అయిన శ్రీ సాయినాధ్ నరోడె గారి అధ్వర్యములో జరుపబడుచున్నది. సాయి కల్యాణ మండపమునకు ప్రారంభోత్సవము జరిగినది. ఐనప్పటికి ఈ ప్రదేశములో ఇప్పటికే వివాహములు జరుగుతున్నవి. ఈ ప్రదేశమును శ్రీ సాయినాధ తెక్డి పంచగురుధామం అన్న పేరుతో ప్రసిధ్ధి చెందుతున్నది.
ఈ సాయి నాధ టెక్డి ని సందర్శించవలయునన్న మార్గము
ఔరంగాబద్ రైల్వే స్టేషన్ కు గాని బస్ స్టాండ్ కి గాని వచ్చి దిగిన భక్తులు తిన్నగ దేవలాయ్ చౌరస్త రోడ్లో సుమారు 4 కిలొ మీటర్లు హై వే కు దగ్గరగా నున్న ఈ స్తలమునకు రావచ్చును. దేవాలయ్ రోడ్ సెంటెర్ మొదలులో ఎవరినైన అడిగి తెలుసుకొగలరు. ఈ ప్రాంతము సింధొన్ బింధొన్ గ్రామమునకు ముందరె యున్నది. ఈ మార్గమున ప్రైవేటు జీపులు కూడా కలవు.
శ్రీ సద్గురు సాయినధ్ మహారాజ్ కీ జై
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|