|
|
Articles: TP Features | తెలుగుభాష రక్షాబంధనం - Mr. Tirumalarao Jayadheer
| |
ఇంతకాలం ఆంగ్ల ప్రభావాన్ని మోసిన జాతే ఇవ్వాళ ఆ పదాలను ఎల్లెడలా నిరాకరిస్తున్న చప్పుడికి కొదవ లేదు. లోకమంతా ప్రపంచీకరణ వ్యాప్తి చెందుతుంటే దాంతో పాటే ఆంగ్లం దేశాల మీద, ప్రాంతాల మీద, భాషల మీద ఆవరిస్తున్నది. తెలుగువాళ్ళు తెలుగు భాషలో ఆంగ్ల పదాలను నిరాకరిస్తున్నారు. ఇదొక్క సంకేతం చాలు, భాషని పది కాలల పాటు పరిరక్షించుకోవడానికి. తెలుగు ప్రజలందరూ ఇందు కోసం కలసిరాకపోయినా ఫరవాలేదు - పదిమంది ముందుకొస్తే చాలు. గత దశాబ్దాల కాలంగా సడీచప్పుడు లేకుండా పరాయి దేశంలో పరాయి నాలుక మొలుస్తున్న చోట మన అక్షరాలు మనం నేర్చుకుందామని బలపం పట్టుకోవడానికి సాహసించే వేళ్ళున్నాయి. అంతే చాలు. నేర్చుకొనేది కేవలం అక్షరాలు కాదు. ఆ అక్షరాలు రూపొందిన అలనాటి చరిత్ర, అక్షరాలకు ఆలంబన అయ్యే ధ్వనులు, ఆ ధ్వనుల్లో దాగిన తెలుగు తీపి, ఆ తీపిలో మాగిన సాంస్కృతిక అభిరుచి అన్నీ అక్కడ ఆవరించుకుపోతాయి.
జాతిని ప్రేరేపించడం మానవ ధర్మం. జాత్యహంకారాన్ని ప్రేరేపించడం దానవ మర్మం. ఏ జాతికైనా ఒక సాంస్కృతిక వ్యక్తీకరణ ఉంటుంది. దాన్ని అందుకోవడం కోసం ఎన్నో చేతులు చేజాస్తున్నాయి. ఆ వేళ్ళ కొనల కదలికల ఆరాటం చూస్తుంటే మనసు ఉద్విగ్నంగా ఉంది. కాని తెలుగు సమాజం ఇంకా గూడుకట్టుకున్న జడత్వం నుండి బయపడటం లేదు. మనుషుల్లాగే జాతి కూడా కవలలను కలిగి ఉంటుంది. సోదర భావన పెనవేసుకుని ఉంటుంది. అటు నుండి పిలిచే పిలుపులకు తెలుగు సమాజం జూలు విదిల్చి స్పందించాలి. కాని ఏమీ చేయనితనంతో కుములుతున్నట్లు కనిపిస్తున్నది. ఇది చేతకానితనమా? లేదా సహజాతి సగం భాగం విస్మరణా? ఎందుకింత అలసత్వం? ఏదో ఒక కారణం ఉండి ఉండాలి.
నేనిక్కడ మొన్నటి ఒక అనుభవం చెప్పదలచుకున్నాను. వినండి.
మీరూ ఒక్కసారి మహారాష్ట్ర ఒక చిన్న సరిహద్దు దాటి వెళ్ళండి. పదుల తెలుగు మూలాలు మీమ్మల్ని ముప్పిరిగొంటాయి. చక్కని తెలుగుభాష మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. శతాబ్దాల కింద ఈ నేల మీద పండిన సాహిత్య విత్తనాలని ఒడిసి పట్టుకున్న పిడికిళ్ళు కనిపిస్తాయి. ఒక్కసారి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని పలకరించండి. మీ కోసం దాచిన ఎన్నో పాటల మూటలు విప్పుతారు. తెలుగు నేల విస్మరించిన ఆచార వ్యవహారాల్ని పరిచయం చేస్తారు. యుగాలుగా దాచుకున్న భాషని వినిపిస్తారు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|