TeluguPeople
  are the trend-setters

 
Articles: Short Stories
నామకరణం
- Site Administrator
< < Previous   Page: 2 of 4   Next > >  
రిక్షా అక్కడ ఆగిది. తాతయ్యకు ఇదేమీ అర్థం కాలేదు. తాతయ్యా.. ఒక్క నిమిషం.. అంటూ బేగ్ లోంచి ఓ దండ తీశాడు. ఎందుకురా తాతయ్య అసహనంతో మూలిగాడు తాతయ్య చూస్తుండగానే వనమాలి ఆ విగ్రాహనికి దండ వేసి వచ్చి రిక్షాలో కూర్చున్నాడు. తాతయ్య వనమాలి చేసిన పనిని సమర్థించలేకపోయాడు. మనవడికేసి అదోలా చూసి వాడికి దండేవిట్రా... మన ప్రత్యర్థి... అంటూ మండిపడ్డాడు. వనమాలి ఏమీ మాట్లాడలేదు. ఆ ఊరు గురించి, ప్రజల గురించీ విన్నాడు. తాత, తండ్రీ కలిసి రాఘవయ్యగారి మంచి పనులకు ఎలా అడ్డు పుల్లలు వేసిందీ - అన్నీ మిత్రుడు సంపత్ ద్వారా ఎప్పుడో తెలుసుకున్నాడు వనమాలి. రిక్షా వెళ్లి ఒక ఇంటి ముందాగింది. అదే తాతయ్య ఇల్లు. ఆ సాయంకాలం... తాతయ్య తోడులేకుండానే వనమాలి ఊళ్ళోకి బయలుదేరాడు. దారిలో గుర్తుపట్టిన పెద్దవారినందరినీ వనమాలి చేతులు జోడిస్తూ పలుకరించాడు. 'గంజాయి వనంలో తులసిమొక్క' వనమాలి తీరుతెన్నుల్ని గమనించిన వాళ్ళు అనుకున్నారు. ఎంతగా మారిపోయింది ఊరు. అడగడుగునా వనమాలికి ఆశ్చర్యమే ఎదురయింది. ఊళ్ళో మచ్చుకైనా ఎక్కడా పూరిగుడిసె కనిపించడం లేదు. డాబాలూ, భవనాలు కొలువుతీరి 'కో' అని పిలుస్తున్నాయి. పన్నెండేళ్లలో ఇంత మార్పు రావడం వనమాలి నమ్మలేకున్నాడు. అక్కడక్కడా షాపులు, పద్ధతిగా రూపొందించిన రోడ్లు, మంచినీటి కుళాయిలు, డ్రయినేజ్ సౌకర్యం ఒకటేమిటి ఇలా ప్రతిదీ వనమాలికి వింతగానే తోచింది. పుట్టి పెరిగిన వూళ్ళో ఇంత అభివృద్ది కనిపించేసరికి వనమాలి ఎంతో సంతోషపడ్డాడు. కొంతదూరం వెళ్ళాక వనమాలి ఓ గుడి ముందాగాడు. గ్రామీణుల సహకారంతో ఆ గుడిని ఎలా తీర్చిదిద్దారో అక్కడున్న ఒక యువకుడు వివరిస్తుంటే వనమాలి విస్తుపోయాడు. ఒకప్పుడు తనకు బాగా తెలిసిన దేవాలయమే అది. అయితే ఆ గుడి స్వరూపమే మారిపోవడంతో గుర్తుపట్టలేకపోయాడు వనమాలి. వేణుగోపాల స్వామి గుడిలో అర్చన చేయించి నాలుగు అడుగులు ముందుకేశాడు. మునసబు గారింటి ముందు వెలసిన కళ్యాణ మంటపం వనమాలిని బాగా ఆకర్షించింది. వివాహాలు మొదలుకొని విద్వత్సభల వరకూ అదే వేదిక కావడం వనమాలిని అమితంగా ఆకట్టుకొంది. మరికంత దూరం సాగాడు. గ్రంధాలయం పలుకరించింది.

Be first to comment on this Article!

< < Previous   Page: 2 of 4   Next > >  



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.